Hyderabad: నగరంలోని ఈ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్ మహానగరానికి కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్‌ (KDWSP) ఫేజ్–3 ద్వారా నీటిని సరఫరా చేస్తున్న పైప్‌లైన్‌లో భారీ లీకేజీ కారణంగా మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. ఈ పనులు అక్టోబర్ 13 ఉదయం 6 గంటల నుండి 14 అక్టోబర్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి.

Hyderabad: నగరంలోని ఈ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం
Drinking Water Supply

Updated on: Oct 11, 2025 | 8:26 PM

కోదండాపూర్ నుంచి గొడకొండ్ల వరకు ఉన్న హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్- 3, పంపింగ్ మెయిన్‌ కి సంబంధించి 2375 ఎంఎం డ‌యా పైప్‌లైన్‌పై భారీ నీటి లీకేజీని అరిక‌ట్ట‌డానికి గానూ, ఎయిర్ వాల్వ్, గేట్ వాల్వ్, పనిచేయని వాల్వ్‌లను మార్చడం వంటి మరమ్మత్తు పనులను చేపట్టనున్నారు.

ఈ ప‌నులు తేదీ: 13.10.2025, సోమవారం ఉద‌యం 6 గంటల నుండి 14.10.2025 మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి.

కాబట్టి.. ఈ 36 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 3 రింగ్ మెయిన్ – 1 కింద ఉన్న రిజర్వాయర్ల ప‌రిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

1. గచ్చిబౌలి, కొండాపూర్, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్.
2. ప్రశాసన్ నగర్, ఫిల్మ్‌నగర్, జూబ్లీ హిల్స్, తట్టి ఖానా, భోజగుట్ట, షేక్‌పేట్, హకీంపేట్, కర్వాన్, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్ హౌస్.
3. దుర్గా నగర్, బుద్వెల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్‌పూర్, గంధంగూడ, బండ్లగూడ, శాస్త్రిపురం, అల్లబండ, మధుబన్, ధర్మసాయి (శంషాబాద్).
4. సాహేబ్‌నగర్, ఆటోనగర్, సరూర్‌నగర్, వాసవి నగర్, నాగోల్, ఎన్‌టీఆర్ నగర్, వనస్థలిపురం, దేవేందర్ నగర్, ఉప్పల్.
5. స్నేహపురి, భారతనగర్, రాంపల్లి, బోడుప్పల్, చెంగిచెర్ల, మానిక్ చంద్, మల్లికార్జున నగర్, పీర్జాదిగూడ, పెద్దఅంబర్‌పేట్.

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.