
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. సెల్లార్‌లో పడి ముగ్గురు బాలికలు మృత్యువాత పడ్డారు. సెల్లార్ కోసం తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు బాలికలు పడిపోయారు. బాలికలను రమ్య (7), సోఫీయా(12), సంగీత(14)గా గుర్తించారు. బాలికల మృతితో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలికల మృతదేహాలను చూసిన కంటతడి పెడుతున్నారు. మాయదారి గుంత బాలికల నిండు ప్రాణాలను బలిగొన్నదని శపిస్తున్నారు. సెల్లార్ కోసం గుంత తవ్విన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతపై ఎలాంటి పైకప్పు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు, మృతుల తల్లిదండ్రులు ఆక్రోషిస్తున్నారు. బాలికల బంగారు భవిష్యత్తును చిదిమిన సెల్లార్ గుంతను వెంటనే పూడ్చాలని కోరుతున్నారు.
Also Read: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సినిమా టికెట్ల కొత్త రేట్లు ఇవే.. పూర్తి వివరాలు మీ కోసం