Special Trains: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను ద.మ.రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కాకినాడ టౌన్ – లింగంపల్లి మధ్య 14 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రత్యేక రైలు (నెం.07275) జనవరి 03, 05, 07 తేదీల్లో రాత్రి 08.10 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.15 గం.లకు లింగంపల్లికి చేరుకుంటుంది. అలాగే ప్రత్యేక రైలు (నెం.07276) జనవరి 04, 06,08 తేదీల్లో సాయంత్రం 06.40 గం.లకు లింగంపల్లి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06.10 గం.లకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంది.
అలాగే మరో ప్రత్యేక రైలు (నెం.07491) జనవరి 10, 12, 14, 17 తేదీల్లో రాత్రి 08.10 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు లింగంపల్లికి చేరుకుంటుంది. అలాగే ప్రత్యేక రైలు (నెం.07492) ఈ నెల 13, 15, 18 తేదీల్లో సాయంత్రం 06.40 గం.లకు లింగంపల్లి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06.50 గం.లకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. మరో ప్రత్యేక రైలు (82714 సువిధ) జనవరి 11న సాయంత్రం 06.40 గం.లకు లింగంపల్లి నుంచి బయలేదేరి మరుసటి రోజు ఉదయం 06.50 గం.లకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
14 Sankranti Special Trains between Kakinada Town – Lingampalli #Sankranti #SpecialTrains #sankranthi #festivals @drmsecunderabad @drmhyb @VijayawadaSCR pic.twitter.com/Aw8ZMDsrJi
— South Central Railway (@SCRailwayIndia) December 30, 2021
ప్రత్యేక రైళ్లు (నెం.07275/నెం.07276) సామర్లకోట, రాజమండ్రి, నిడుదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, నల్గొండ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ప్రత్యేక రైళ్లు (నెం.07491/నెం.07492) సామర్లకోట, రాజమండ్రి, నిడుదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. మరో ప్రత్యేక రైలు (నెం.82714 సువిధ) సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.
ఈ ప్రత్యేక రైళ్లలో 1 ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ సీటింగ్ కోచ్‌లు ఉండనున్నాయి. పూర్తి రిజర్వేషన్లతో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు మొదలయ్యాయి. నేరుగా రైల్వే టికెట్ కౌంటర్లు లేదా IRCTC వెబ్‌సైట్, యాప్ ద్వారా టిక్కెట్లను రిజర్వ్ చేసుకోవచ్చు.
Also Read..
Good news: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ కానుకగా బ్రాండ్ల మద్యం..
Astro Tips ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..