కుళ్ళిన చికెన్‌తో బిర్యానీ.. హైదరాబాద్ ‘బావర్చి’ ఇంత అరాచకమా.?

మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న సామెతను హైదరాబాద్‌లో పలు ప్రముఖ హోటళ్లలోని ఆహార పదార్ధాలకు కొంచెం మార్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవి చూడడానికి ఘుమఘుమలాడుతూ లొట్టలేసుకుని తినే విధంగా కనిపిస్తున్నా.. నాణ్యతపరంగా చూస్తే మాత్రం షాక్ తినాల్సిందే. ఈ మధ్యకాలంలో బడా హోటల్స్ యజమానులందరూ లాభాలు, ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు తప్పితే.. కస్టమర్ల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ఇప్పటికే పలుమార్లు హోటళ్లు, రెస్టారెంట్లు తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులకు చాలా […]

  • Ravi Kiran
  • Publish Date - 12:49 am, Wed, 20 November 19
కుళ్ళిన చికెన్‌తో బిర్యానీ.. హైదరాబాద్ 'బావర్చి' ఇంత అరాచకమా.?

మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న సామెతను హైదరాబాద్‌లో పలు ప్రముఖ హోటళ్లలోని ఆహార పదార్ధాలకు కొంచెం మార్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవి చూడడానికి ఘుమఘుమలాడుతూ లొట్టలేసుకుని తినే విధంగా కనిపిస్తున్నా.. నాణ్యతపరంగా చూస్తే మాత్రం షాక్ తినాల్సిందే. ఈ మధ్యకాలంలో బడా హోటల్స్ యజమానులందరూ లాభాలు, ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు తప్పితే.. కస్టమర్ల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ఇప్పటికే పలుమార్లు హోటళ్లు, రెస్టారెంట్లు తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులకు చాలా రోజుల పాటు నిల్వ ఉన్న, పాడైపోయిన ఆహార పదార్ధాలు లభించాయి. దీన్ని బట్టే భాగ్యనగరంలోని హోటల్స్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి ప్రముఖ హోటల్ బావర్చిలో ఎదురైంది. హైదరాబాద్ జీఎచ్ఎంసీ అధికారులు నిర్వహిస్తున్న ‘మన నగరం- మన ప్రణాళిక’లో భాగంగా పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫీర్జాదిగూడ పరిధిలోని పర్వతాపూర్ రోడ్డులో ఉన్న బావర్చి హోటల్‌ను తనిఖీ చేయగా.. పాడైపోయిన ఆహార పదార్ధాలతో పాటుగా కుళ్ళిన చికిన్‌ను గుర్తించారు. అంతేకాకుండా పరిసరాలు సైతం శుభ్రంగా లేకపోవడంతో స్థానిక మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసి.. రూ.10 వేలు జరిమానా విధించారు. కస్టమర్లకు నాణ్యమైన ఆహార పదార్ధాలను ఇవ్వాలని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలంటూ హోటల్ సిబ్బందిని ఆయన హెచ్చరించారు. పేరుకు బావర్చి అయినా.. దానికి తగ్గట్టు నాణ్యమైన ఆహారం మాత్రం లేదు. అందుకే తినడానికి రెస్టారెంట్లకు వెళ్ళేటప్పుడు కాస్త అలోచించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.