Hyderabad: భాగ్యనగర వాసులకు గుడ్‌న్యూస్‌.. ఇవాళ అందుబాటులోకి రానున్న 10 మినీ రేడియాలజీ హబ్స్‌..

|

May 11, 2022 | 7:29 AM

ఈ రోజుల్లో చికిత్స కంటే, పరీక్షలకే ఎక్కువ డబ్బు ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ వైద్యారోగ్య శాఖ.

Hyderabad: భాగ్యనగర వాసులకు గుడ్‌న్యూస్‌.. ఇవాళ అందుబాటులోకి రానున్న 10 మినీ రేడియాలజీ హబ్స్‌..
Hyderabad Radiology Hubs
Follow us on

Hyderabad Radiology Hubs: నిరుపేద రోగులకు మెరుగైన వైద్యంతో పాటు, నాణ్యమైన వైద్య పరీక్షల కోసం శ్రీకారం చుట్టింది తెలంగాణలోని కేసీఆర్ సర్కార్‌. GHMC పరిధిలో మరిన్ని మినీ రేడియాలజీ హబ్స్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. గ్రేటర్‌లోని బస్తీ ఆస్పత్రుల దగ్గర్నుంచి జిల్లా దవాఖానాల వరకు, అన్ని రకాల ఆరోగ్య కేంద్రాల్లో రక్త నమూనాలు, మలమూత్ర నమూనాలను సేకరించి, వైద్యులు సిఫారసు చసిన పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు సైతం ఆన్‌లైన్‌ ద్వారా సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు, రోగి సెల్‌ఫోన్‌కు పంపుతున్నారు. ఈ రోజుల్లో చికిత్స కంటే, పరీక్షలకే ఎక్కువ డబ్బు ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ వైద్యారోగ్య శాఖ. గతంలో ఉస్మానియా, గాంధీ వంటి టీచింగ్‌ హాస్పిటల్స్‌లోనే రక్తం, ఇతరత్రా పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు ఉండేవి. కానీ, ఇప్పుడు వాటిని విస్తరించింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. తాజాగా మరో 12 రేడియాలజీ మినీ హబ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది కేసీఆర్ సర్కార్.

మొత్తం 20 మినీ హబ్స్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ప్రభుత్వం, ఏడాది కిందట 8 కేంద్రాలను ప్రారంభించింది. మరో 12 రేడియాలజీ మినీ హబ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టింది. వీటిలో 10 కేంద్రాల నిర్మాణం పూర్తయ్యింది. ఆ 10 కేంద్రాలను మంత్రి హరీశ్‌రావు ఇవాళ ప్రారంభించనున్నారు.

రేడియాలజీ మినీ హబ్స్‌ ఎక్కడెక్కడ ప్రారంభించనున్నారంటే..?

మలక్‌పేట ఏరియా హాస్పిటల్‌, కుషాయిగూడ పట్టణ పీహెచ్‌సీ, అల్వాల్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హయత్‌నగర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, రాజేంద్రనగర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, అమీర్‌పేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, పటాన్‌చెరు ఏరియా హాస్పిటల్, గోల్కొండ ఏరియా హాస్పిటల్‌, శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నార్సింగి రూరల్‌ ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Gold Silver Price Today: గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Cyclone Asani Live Updates: కాసేపట్లో తీరాన్ని తాకనున్న అసని తుఫాన్.. కాకినాడ తీరంలో రెడ్ అలర్ట్..