Hyderabad: భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య.. అంతలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరూ కలిసి ముద్దుల మొగున్ని..

హైదరాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన రెండో భార్యతో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన మొదటి భార్య అతన్ని దారుణంగా హత్య చేసింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే..

Hyderabad: భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య.. అంతలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరూ కలిసి ముద్దుల మొగున్ని..
Couple Romance

Updated on: Feb 09, 2023 | 6:30 AM

హైదరాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన రెండో భార్యతో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన మొదటి భార్య అతన్ని దారుణంగా హత్య చేసింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. అతన్ని చంపేందుకు రెండో భార్య కూడా సహకరించింది. ఈ షాకింగ్ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సురేష్(28), రేణుక ఇద్దరూ ప్రేమించుకుని 2016 పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లయిన తరువాత రేణుక మద్యానికి బానిస అయ్యింది. ఎక్కువ సమయం మద్యం షాపుల వద్దే గడిపేది. ఆ క్రమంలో ఇతర వ్యక్తులతో సన్నిహితంగా మెలిగేది. అయితే, ఇటీవల బహదూర్‌పల్లిలోని ఓ మద్యం దుకాణంలో దుండిగల్‌ తాండాకు చెందిన ఓ అనాథ బాలికతో రేణుకకు పరిచయం ఏర్పడింది. బాలిక అనాథ కావడంతో రేణుక ఆమెను తన ఇంట్లోనే ఉంచుకుంది. ఆ తర్వాత భర్త సురేష్‌ను ఒప్పింది అతనితో పెళ్లి చేసింది. సురేష్, రేణుక, అనాథ బాలికతో సహా ముగ్గురూ గత 15 రోజులుగా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.

అయితే, బాలికతో పెళ్లి తర్వాత రేణుకను వదిలించుకోవాలని సురేష్ ప్రయత్నించాడు. అది ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. ఆదివారం రాత్రి ముగ్గురు కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో సురేష్ నిద్రపోయిన తర్వాత రేణుక బాలిక సాయంతో అతడి మెడకు శాలువా బిగించి చంపేసింది. అనంతరం.. రేణుక తన సహచరుడితో కలిసి మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని వారు ఉంటున్న భవనంలోని రెండో అంతస్తు నుంచి ఇంటి ముందున్న రోడ్డుపైకి తోసేసింది. అనంతరం సురేష్ బంధువులకు ఫోన్ చేసి భర్త ఇంటికి రాలేదని చెప్పింది. మరుసటి రోజు తన భర్తను ఎవరో హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ముందు వదిలేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..