Rains In Hyderabad: ఓ వైపు భాగ్యనగరంలో బోనాలు సందడి నెలకొంటే.. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జంటనగరాల్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, ముషీరాబాద్, పాత బస్తీ, దిల్ షుక్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ ఎంసి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 21న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని చెప్పారు. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రాగాల మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని.. ప్రజలు ప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది కనుక వేడి నీరు తాగాలని .. సీజనల్ వ్యాధులతో పాటు.. కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: ఆంధ్రా స్టైల్‌లో టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ కూర తయారీ విధానం..