Watch Video: భాగ్యలక్ష్మి అమ్మవారికి స్వయంగా హారతి ఇచ్చిన సీఎం యోగి.. వైరల్‌గా మారిన వీడియో

|

Jul 04, 2022 | 12:50 PM

Yogi Adithyanath In Hyderabad: భాగ్యలక్ష్మి అమ్మవారి పవిత్ర దర్శనం, ఆరాధనతో తన మనస్సు ఉప్పొంగిపోయిందంటూ యోగి ఓ ట్వీట్ చేశారు.

Watch Video: భాగ్యలక్ష్మి అమ్మవారికి స్వయంగా హారతి ఇచ్చిన సీఎం యోగి.. వైరల్‌గా మారిన వీడియో
UP CM Yogi Adithyanath at Bhagyalakshmi Temple in Hyderabad
Follow us on

CM Yogi Adithyanath Video: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ పాతబస్తీలోని ఛార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వయంగా అమ్మావారికి హారతి ఇచ్చారు యోగి. భాగ్యలక్ష్మి అమ్మవారి పవిత్ర దర్శనం, ఆరాధనతో తన మనస్సు ఉప్పొంగిపోయిందంటూ యోగి ఓ ట్వీట్ చేశారు. అమ్మవారి అందరిని అనుగ్రహించాలని, అందరి జీవితాలు సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో నిండి ఉండాలని కోరుకున్నారు. అమ్మవారికి హారతి ఇస్తున్న వీడియోను యోగి తన ట్వీట్‌కు జత చేర్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న సమయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజా సింగ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ పర్యటన నేపథ్యంలో ఛార్మినార్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలను సైతం మోహరించారు.

అమ్మవారికి స్వయంగా హారతి ఇస్తున్న యూపీ సీఎం యోగి..

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి