Telangana: మాట్లాడుదామని పిలిచాడు.. కళ్లు మూసి తెరిచేలోపు దారుణానికి పాల్పడ్డాడు..
ప్రేమ పేరుతో మరో ఉన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. మాట్లాడాలని పిలిపించి ఆమెపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. అందరూ చూస్తుండగానే కత్తితో ఇష్టమొచ్చినట్టు దాడి చేశాడు ప్రేమోన్మాది.

ప్రేమ పేరుతో మరో ఉన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. మాట్లాడాలని పిలిపించి ఆమెపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. అందరూ చూస్తుండగానే కత్తితో ఇష్టమొచ్చినట్టు దాడి చేశాడు ప్రేమోన్మాది. గండిపేట మండలం నార్సింగిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కత్తిపోట్లకు గురైన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వాసవి అనే యువతి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఆ యువతి సమీప బంధువు గణేష్ అనే యువకుడు కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యువతి అతని ప్రేమను నిరాకరించడంతో కసి పెంచుకున్నాడు. అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. మాట్లాడుదామని పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
