Special Trains: ప్రయాణికులకు అలర్ట్… గంగా పుష్కరాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు ఇవే

|

Apr 28, 2023 | 4:10 PM

గంగా పుష్కరాలు వెళ్లే యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్-బనారస్ మధ్య 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు అందుబాటులో ఉంటాయి. వాటి వివరాలు మీ కోసం..

Special Trains: ప్రయాణికులకు అలర్ట్... గంగా పుష్కరాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు ఇవే
Special Trains For Pushkaralu
Follow us on

గంగా పుష్కరాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-బనారస్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు ఏప్రిల్ 29 మధ్య మే 5 వరకు నడుస్తాయి. ట్రైన్ నంబర్ 07303 సికింద్రాబాద్ నుండి ఏప్రిల్ 29న రాత్రి 9.40 గంటలకు బయలుదేరి మే 1వ తేదీ ఉదయం 06.30 గంటలకు బనారస్ చేరుకుంటుంది. తిరుగు దిశలో రైలు (07304) బనారస్ నుండి మే 1న ఉదయం 08.35 గంటలకు బయలుదేరుతుంది. మే 2న సాయంత్రం 6.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

రెండవ ప్రత్యేక రైలు( 07305) సికింద్రాబాద్ నుండి మే 3వ తేదీ రాత్రి 9.40 గంటలకు బయలుదేరి.. మే 5వ తేదీ ఉదయం 06.30 గంటలకు బనారస్ చేరుకుంటుంది. ఇదే మార్గంలో ట్రైన్ నెంబర్ 07306 మే 5న అందుబాటులో ఉంది. ఈ ట్రైన్ బనారస్‌లో శుక్రవారం ఉదయం 8.35 గంటలకు బయల్దేరి.. శనివారం సాయంత్రం 6.15 గంటలకు సికింద్రాబాద్ రీచ్ అవుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట్, పెద్దపల్లి, రామగే డంపెనర్, బెల్లంపల్లి, సిర్పుర్‌కాగజ్‌నగర్, బల్హర్షా, నాగ్‌పూర్, ఇటాలియన్, పిపారియా, జబల్‌పూర్, కట్ని జంక్షన్, శాంతా, మణిపూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకీ స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.