Watch Video: తెలంగాణ వైట్‌హౌస్.. కొత్త సచివాలయం డ్రోన్ విజువల్స్ చూశారా..! రెండు కళ్లు చాలవు..

Watch Video: తెలంగాణ వైట్‌హౌస్.. కొత్త సచివాలయం డ్రోన్ విజువల్స్ చూశారా..! రెండు కళ్లు చాలవు..

Janardhan Veluru

|

Updated on: Apr 28, 2023 | 5:29 PM

భాగ్యనగరి సిగలో కొత్త కోహినూర్‌ మెరుస్తోంది. హైదరాబాద్‌ నడిబొడ్డున ఠీవిగా నిలబడి చూస్తోంది తెలంగాణ కొత్త సచివాలయం. ఏప్రిల్ 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకానున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం ఓ అద్భుత నిర్మాణంగా చెప్పుకోవచ్చు.

భాగ్యనగరి సిగలో కొత్త కోహినూర్‌ మెరుస్తోంది. హైదరాబాద్‌ నడిబొడ్డున ఠీవిగా నిలబడి చూస్తోంది తెలంగాణ కొత్త సచివాలయం. ఏప్రిల్ 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకానున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం ఓ అద్భుత నిర్మాణంగా చెప్పుకోవచ్చు. దీనిలోని కాకతీయ నిర్మాణ శైలి అబ్బురపరుస్తోంది. హిందూ, దక్కనీ శైలుల మేళవింపుతో నిర్మాణం అదరహో అనిపిస్తోంది.  గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా డిజైన్‌ చేశారు. కొత్త సచివాలయంలో పచ్చదనం కోసం 8 ఎకరాల స్థలం కేటాయించారు. భవనంపై మొత్తం 34 డోమ్‌లు ఏర్పాటు చేశారు. రెండు డోమ్‌లపై ప్రత్యేక ఆకర్షణగా జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేశారు. ముందు, వెనుక భాగాల్లో అత్యంత ఎత్తయిన డోమ్‌లు ఉన్నాయి. ప్రధాన డోమ్‌లు సుమారు 165 అడుగుల ఎత్తు ఉన్నాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబైన కొత్త సచివాలయ డ్రోన్ విజువల్స్ ఇక్కడ మీ కోసం..

Published on: Apr 28, 2023 05:27 PM