
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, టోలీచౌకీ, గచ్చిబౌలిలో వర్షం దంచికొడుతోంది. మియాపూర్, మల్లాపూర్, సరూర్‌నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లిలో కూడా వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై భారీగా వర్షపునీరు నిలవడంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన కూడళ్లలో వాహనదారులు అవస్ధలు పడుతున్నారు. ప్రస్తుతం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో రోడ్లన్ని వాహనాలతో నిండిపోయాయి.
కాగా ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా హైదరాబాద్‌లో భారీ వర్షపాతం నమోదు అయింది. మియాపూర్‌లో 9.7 సెం.మీ, లింగంపల్లిలో 8.2 సెం.మీ., HCUలో 8.1సెం.మీ, గచ్చిబౌలిలో 6.6,చందానగర్‌లో 6.4.. హఫీజ్‌పేట్‌లో 5.6, ఫతేనగర్‌లో 4.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. అయితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు బయటికి రాకపోవడం మంచిదని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి