Telangana Elections: హైదరాబాద్‌లో 23 కేజీల బంగారం, 320 కేజీల వెండి సీజ్.. పంపకాల కోసమేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల అటెన్షన్‌ పెరిగింది. రాజధాని సహా పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. డబ్బు, మద్యం తరలింపుపై పోలీసులు నిఘా పెట్టారు. తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగానే పోలీసులు నిఘా పెట్టారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్న తెలంగాణలో దాదాపు 148 చెక్‌పోస్టులు ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ వెల్లడించింది. ఇక ఎన్నికల కోడ్‌ను అనుసరించి ఈసీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని తెలంగాణ పోలీస్‌ శాఖ నిర్ణయించింది.

Telangana Elections: హైదరాబాద్‌లో 23 కేజీల బంగారం, 320 కేజీల వెండి సీజ్.. పంపకాల కోసమేనా?
Hyderabad Checking

Edited By: Shiva Prajapati

Updated on: Oct 10, 2023 | 9:05 AM

Hyderabad, October 10: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల అటెన్షన్‌ పెరిగింది. రాజధాని సహా పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. డబ్బు, మద్యం తరలింపుపై పోలీసులు నిఘా పెట్టారు. తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగానే పోలీసులు నిఘా పెట్టారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్న తెలంగాణలో దాదాపు 148 చెక్‌పోస్టులు ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ వెల్లడించింది. ఇక ఎన్నికల కోడ్‌ను అనుసరించి ఈసీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని తెలంగాణ పోలీస్‌ శాఖ నిర్ణయించింది. రాషష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు మొదలుపెట్టింది. డబ్బు, మద్యం తరలింపుపై నిఘా పెట్టారు. రాజధాని హైదరాబాద్‌ సహా పలు జిల్లాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి..వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. చాలా చోట్ల డబ్బు, బంగారం, మద్యం పట్టుబడింది.

బషీర్‌బాగ్‌లో 16 కిలోల బంగారం, 20కిలోల వెండి..

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ సిటీ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం సీజ్‌ చేశారు. బషీరాబాగ్‌లోని నిజాంక్లబ్‌ ఎదుట 16 కిలోల బంగారం, 20 కిలోల వెండి, అబిడ్స్‌లో మరో 7 కేజీల బంగారం, 300 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఇక చందానగర్‌లో 6 కేజీల బంగారం సీజ్‌ చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్‌లో రూ.1.06 కోట్ల నగదు పట్టుబడింది. షేక్‌పేట్‌లో కారులో తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. శంకర్‌పల్లిలో రూ. 80 లక్షలు, హబీబ్‌నగర్‌లో రూ. 17 లక్షలు, పురానాపూల్‌లో రూ. 15 లక్షలు, చాదర్‌ఘాట్‌లో రూ. 10 లక్షలు, వనస్థలిపురంలో రూ. 4 లక్షలు పట్టుబడింది. శేరిలింగంపల్లి పరిధిలోని గోపనపల్లిలో కాంగ్రెస్‌ నేత ఫొటోతో ఉన్న రైస్‌ కుక్కర్లను పంపిణీ చేస్తున్న కొందరిని గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి.. 87 కుక్కర్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇక మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో విస్తృత తనీఖీలు కొనసాగుతున్నాయి. భైంసా సమీపంలో ఉన్న చెక్‌పోస్టుల దగ్గర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. భైంసాలో పలు దాబాలపై పోలీసుల బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. మొత్తం 6 దాబాల్లో రూ. 50 వేలకుపైగా విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఎవరైనా రూల్స్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరాలో కారులో తరలిస్తున్న రూ. 5 లక్షల నగదు సీజ్‌ చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

జయశంకర్‌ భూపాలపల్లిజిల్లా కాళేశ్వరం అంతర్‌రాష్ట్ర వంతెన బోర్డర్‌ చెక్‌పోస్టును సందర్శించారు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో డబ్బు, మద్యం , డ్రగ్స్‌తోపాటు నిషేధిత వస్తువులు సరఫరా కాకుండా పకడ్బందీగా భద్రత చర్యలు చేపబడుతున్నామన్నారు డీజీపీ అంజనీకుమార్‌. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ సరిహద్దులో జాతీయ రహదారులపై తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలను దుండిగల్‌ పీఎస్‌ పరిధిలోని గాగిళ్లపూర్‌ చెక్‌పోస్టు దగ్గర తనిఖీలు చేశారు. దుండిగల్‌ ORR, గండి మైసమ్మ చౌరస్తాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. సరైన పత్రాలు లేకుండా భారీగా డబ్బు పట్టుబడితే సీజ్‌ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..