
హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్జాదుల్లా బాగ్ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. శుక్రవారం (జనవరి 31) చేపట్టిన ఈ దాడిలో తీన్ పత్తీ (పేకాట) ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్ ఎ. సీతయ్య తెలిపారు.
అమ్జాదుల్లా బాగ్ ఫాతిమా నగర్‌లోని ఓ ఇంట్లో అక్రమంగా పేకాట జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించి పోలీసులు ప్రత్యేక బృందాలతో జనవరి 30, శుక్రవారం రాత్రి 7:20 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకుని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో తీన్ పత్తీ ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ దాడిలో అరెస్ట్ అయినవారిలో మహమ్మద్ బాబా, మహమ్మద్ చాంద్, ఖాదర్ అలీ, మహమ్మద్ మెహబూబ్, చాంద్ పాషా, షేక్ రషీద్ ఉన్నారు. వీరంతా ఫాతిమా నగర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.9,960 నగదు మరియు ఒక సెట్ పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మహమ్మద్ బాబా ఈ పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నట్లు అంగీకరించినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 51/2026గా నమోదు చేసి, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..