MLA Rajasingh: మరో వివాదంలో ఎమ్మెల్యే రాజాసింగ్.. నోటీసులు జారీ చేసిన పోలీసులు..

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. అజ్మీర్‌ దర్గాపై రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని..

MLA Rajasingh: మరో వివాదంలో ఎమ్మెల్యే రాజాసింగ్.. నోటీసులు జారీ చేసిన పోలీసులు..
Mla Raja Singh

Updated on: Jan 20, 2023 | 8:05 AM

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. అజ్మీర్‌ దర్గాపై రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని..ఆ కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలంటూ 41A కింద నోటీసులిచ్చారు. అజ్మీర్‌ దర్గాపై రాజాసింగ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో..ఆయనపై గతేడాది ఆగస్ట్‌లో కేసు నమోదైంది.

ఇక అంతకుముందు మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, పలు కేసులతో..రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగించి అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. అనంతరం, కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు రాజాసింగ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..