Fire Accident: డెక్కన్‌మాల్‌ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు.. భవనం కూల్చివేతకు నిర్ణయం

సికింద్రాబాద్‌ నల్లగుట్టలో చెలరేగుతున్న మంటలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రామ్‌గోపాల్‌పేటలోని డెక్కన్‌ నైట్‌వేర్ స్పోర్ట్స్ షోరూంలో గురువారం ఉదయం 11 గంటలకు అగ్ని ప్రమాదం..

Fire Accident: డెక్కన్‌మాల్‌ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు.. భవనం కూల్చివేతకు నిర్ణయం
Fire Accident
Follow us

|

Updated on: Jan 20, 2023 | 8:01 AM

సికింద్రాబాద్‌ నల్లగుట్టలో చెలరేగుతున్న మంటలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రామ్‌గోపాల్‌పేటలోని డెక్కన్‌ నైట్‌వేర్ స్పోర్ట్స్ షోరూంలో గురువారం ఉదయం 11 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అప్పటి నుంచి ఇంకా మంటలను ఆర్పుతూనే ఉన్నారు. ఘటన స్థలంలో 30 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రస్తుతం మంటలు అదుపులోకి రాగా, షాపింగ్‌ మాల్‌ పక్కన ఉన్న మరో బిల్డింగ్‌కు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే ఈ డెక్కన్‌మాల్‌ కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. సెల్లార్‌ నుంచి ఇంకా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. కాసేపట్లో బిల్డింగ్‌ను అధికారులు పరిశీలించనున్నారు.

ఈ నేపథ్యంలో డెక్కన్‌మాల్‌ ప్రమాదంపై కేసు నమోదు అయ్యింది. అయితే భవనం నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. యజమాని మహ్మద్‌, రహీంపై కేసు నమోదు చేశారు పోలీసులు. వసీం, జునైద్‌, బహీర్‌ అనే వ్యక్తులు మిస్సయినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. అయితే నల్లటి దట్టమైన పొగ, ఎగిసిపడుతున్న మంటలతో ముగ్గురిని గుర్తించలేకపోతున్నామని పోలీసులు తెలిపారు. భవనానికి సెట్‌ బ్యాక్‌ లేకపోవడం, నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి