Hyderabad: సామాన్యులను భయపెడుతున్న కొత్త రూల్స్.. బయటకు రావాలంటే భయపడుతున్న జనం

మీరు రాత్రిపూట భార్య, పిల్లలతో బయటికి వెళ్తున్నారా..? అయితే ఇది మీ కోసమే. ఏదైనా పని మీద కానీ, లేదా పెళ్లిళ్లు, ఫంక్షన్లు అని కుటుంబంతో సహా రాత్రిపూట బయటికి వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారు. కావాల్సిన బండి పేపర్లు అన్నీ ఉన్నా కూడా పోలీసులు ఆపి తమపై దౌర్జన్యం చేస్తున్నారని సదరు బాధితులు వాపోతున్నారు.

Hyderabad: సామాన్యులను భయపెడుతున్న కొత్త రూల్స్.. బయటకు రావాలంటే భయపడుతున్న జనం
Hyderabad Police Checking

Edited By: Balaraju Goud

Updated on: Jul 02, 2024 | 8:54 PM

మీరు రాత్రిపూట భార్య, పిల్లలతో బయటికి వెళ్తున్నారా..? అయితే ఇది మీ కోసమే. ఏదైనా పని మీద కానీ, లేదా పెళ్లిళ్లు, ఫంక్షన్లు అని కుటుంబంతో సహా రాత్రిపూట బయటికి వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారు. కావాల్సిన బండి పేపర్లు అన్నీ ఉన్నా కూడా పోలీసులు ఆపి తమపై దౌర్జన్యం చేస్తున్నారని సదరు బాధితులు వాపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచూ జరుగుతుండడం సర్వసాధారణం అయిపోయింది.

రోజూ ఆఫీసులు అని, ఇంటి పనులు అని ఎప్పుడూ బిజీ లైఫ్ కి అలవాటు పడిపోయే మధ్య తరగతి ప్రజలు ఎప్పుడో కాస్త తీరిక దొరికితే కుటుంబంతో కలిసి సరదాగా బయటికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. లేదా తెలిసిన వాళ్ల ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అనే పేరుతో బయటికి వెళ్లే ఇలాంటి సాధారణ జనానికి ఇప్పుడు పోలీసుల చర్యలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఏ తప్పూ చేయకపోయినా తమని ఎందుకు ఆపేశారని, ఇలా కూడా వెళ్లకుండా చేస్తే ఎలా అని బాధితులు నిలదీస్తున్నారు. తమ వాహనానికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నా కూడా నిలువరించి, వాహనాన్ని లాక్కొని కేసు నమోదు చేసి తమని నడి రోడ్డు మీద వదిలేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు.

రాత్రిపూట కుటుంబం మరీ ముఖ్యంగా చిన్నపిల్లలతో కలిసి బయటికి వెళ్లినప్పుడు ఇలా దిక్కుతోచనిస్థితిలో నిలిపేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. అంత రాత్రి సమయంలో ఎటు పోవాలో అర్థం కాక కష్టంగా ఉంటుందని చెబుతున్నారు. తప్పు చేస్తే శిక్షించాలి కానీ, కాసేపు బయటికి వస్తేనే ఇలా తమపై దౌర్జన్యం చేస్తే ఎలా అని పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పెద్ద పెద్ద నేరాలు చేసేవాళ్లని వదిలేసి, మాలాంటి అమాయక ప్రజల మీద పెత్తనం చూపించడం ఎంతవరకు సరైనదో చెప్పాలని అడుగుతున్నారు. ఇటీవలే పాతబస్తీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి రెండు ఘటనలు జరగటం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనగా మారింది. స్థానిక పోలీసులు ఇలా చేయడం ఏ మాత్రం సరికాదని, దీనికి సంబంధించి పై అధికారులు ఏమైనా చొరవ తీసుకుని ఇలాంటి చర్యలు ఆపివేసి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని బాధిత ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..