Hyderabad: భాగ్యనగరంలో సరికొత్త మోసం. రూ.2.5 కోట్ల విలువైన 21 కార్లు మాయం చేసిన కి’లేడీ’

ఉష చెబుతున్న మాటలతో అనుమానం వచ్చిన కొంతమంది కార్ల యజమానులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Hyderabad: భాగ్యనగరంలో సరికొత్త మోసం. రూ.2.5 కోట్ల విలువైన 21 కార్లు మాయం చేసిన కి'లేడీ'
Woman Cheater Arrest
Follow us
Sridhar Rao

| Edited By: Balaraju Goud

Updated on: Dec 03, 2024 | 10:24 AM

టెక్నాలజీ పెరిగేకొద్దీ, అదే రెంజ్‌లో రకరకాల మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటుపడిన మాయగాళ్లు, అమాయకులను టార్గెట్‌ చేస్తూ.. మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లో ఓ మాయలేడీ బండాబండారం బయటపడింది. అద్దె కార్ల పేరుతో రూ. రెండున్నర కోట్ల విలువైన 21 కార్లను కొట్టేసింది. చాలా ఈజీగా కార్ల యజమానులకు టోకరా వేసింది. అదీ కూడా రెండు నెలల కాలంలోనే అంతా జరిగిపోయింది. దీంతో ఫిర్యాదులు అందుకున్న రాయదుర్గం పోలీసులు పక్కా నిఘాతో ముఠా గుట్టు రట్టు చేశారు.

హైదరాబాద్ మహానగరం గచ్చిబౌలిలోని టెలికాంనగర్‌‌కు చెందిన జూపూడి ఉష గృహిణి. అనారోగ్య కారణాలతో కొంతకాలం క్రితం ఆమె భర్త మృతి చెందాడు. అప్పటి నుండి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలు చేస్తోంది. దానికి ఓ పథకం వేసిన ఆమె తన వద్ద డ్రైవర్‌గా పని చేసిన మల్లేష్ తో కలిసి కార్ల దందాకు తెరలేపింది. దీంతో ఈజీ మనీ కోసం ఇద్దరు కలిసి పక్కాగా ఫ్లాన్ చేశారు. నగరంలో పెరుగుతున్న అద్దె కార్ల మోజును క్యాష్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురి వద్ద కార్లను అద్దె పేరుతో తీసుకున్నారు. ఆ కార్లను అత్తాపూర్‌లో ఉంటున్న కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన సాగర్ పాటిల్, జమనే అనిల్‌ కుమార్‌ అనే వ్యక్తులకు అమ్మేశారు. ఖరీదైన కార్లను సతం చాలా చౌకగా.. రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షలకు వాటిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారు.

కార్లను కిరాయికి తిప్పుతామని, నెలనెల అద్దె భారీగా చెల్లిస్తామని తెలిసిన వారి ద్వారా ప్రచారం చేశారు. కొంతమంది కార్ల యజమానులను నమ్మించి 21 కార్లు అద్దెకు తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వాహనాలను కర్ణాటక రాష్ట్రం తరలించారు. కార్లకు అమర్చిన జీపీఎస్‌ను తొలగించారు. యజమానుల వద్ద తీసుకున్న ధ్రువపత్రాలతో కర్ణాటకలోని పలు నగరాల్లో అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకున్నారు. అయితే కొన్ని రోజులుగా కార్ల యజమానులకు అద్దె చెల్లించకపోవడంతో అనుమానం వచ్చింది. కార్లు ఎక్కడా అని నిలదీయడంతో కారు చోరీ అయిందని, పోలీసులకు ఫిర్యాదు చేశామని, దొరకగానే కారుతోపాటు అద్దె చెల్లిస్తామని బురిడీ కొట్టిస్తూ వస్తున్నారు.

అయితే ఉష చెబుతున్న మాటలతో అనుమానం వచ్చిన కొంతమంది కార్ల యజమానులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, డీసీపీ వినీత్ ఆదేశాలతో ఏసీపీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ సతీష్ టీమ్ రంగంలోకి దిగింది. ఆమె ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు మోసం వెలుగులోకి వచ్చింది. అద్దెకు తీసుకున్న కార్లను కర్ణాటకకు తరలించి అద్దెకు తిప్పుతూ నెల రోజుల్లోనే రూ. 60 లక్షలకు పైగా సంపాదించినట్లు తేలింది. కార్ల యజమానులకు అద్దె ఇవ్వకుండా రూ. 20 లక్షల అప్పులు తీర్చుకుంది. ముఠాలో కీలకంగా వ్యవహరించిన డ్రైవర్ సొంతింటి నిర్మాణానికి ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా నిఘా ఉంచిన పోలీసులు ఉషతోపాటు ఆమెకు సహకరించిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కాగా, కార్లను అద్దెకు ఇచ్చే వారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుడ్డిగా నమ్మి మోసపోవద్దని చెబుతున్నారు. కార్లను తీసుకెళ్లేవారి పూర్తి వివరాలు తెలిస్తేనే అద్దెకు ఇవ్వాలని లేదంటే.. తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!