Hyderabad: మరోసారి ఉగ్రరూపం దాల్చుతున్న మూసీ.. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు..

|

Oct 14, 2022 | 8:54 AM

హైదరాబాద్‌లో జంట జలాశయాలు మరోసారి ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద వస్తుండడంతో గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

Hyderabad: మరోసారి ఉగ్రరూపం దాల్చుతున్న మూసీ.. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు..
Musi Floods
Follow us on

హైదరాబాద్‌లో జంట జలాశయాలు మరోసారి ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద వస్తుండడంతో గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉండాలని అధికారులు ప్రకటించారు. ఎప్పుడు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అన్ని శాఖ అధికారులను మోహరించారు.

హైదరాబాద్‌ శివారుతో పాటు.. మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్‌ సాగర్‌ జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. గేట్లు ఓపెన్ చేయాల్సి వచ్చింది. భారీ వరద వస్తుండడంతో మూసీ నది ఉరకలెత్తుతోంది. అంబర్‌పేట్‌ నుండి దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లే దారిలో మూసారాంబాగ్ బ్రిడ్జిని తాకేలా నీరు ప్రవహిస్తోంది. అంబర్‌పేట్‌, మలక్‌పేట్‌ పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టారు.

గండిపేట జలాశయం 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్‌ఫ్లో 2వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ ఫ్లో 2వేల 748 క్యూసెక్కులుగా ఉంది. 4 అడుగుల మేర 6 గేట్లు ఎత్తారు. లోతట్టుప్రాంత వాసులను అప్రమత్తం చేశారు.

ఇవి కూడా చదవండి

హిమాయత్‌సాగర్‌లో 3 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 2వేల 500 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 2వేల 800 క్యూసెక్కులుగా ఉంది. రెండు జలాశయాల నుంచి మూసీకి భారీగా వరద వస్తుండడంతో లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని కాలనీల వాసులను ఖాళీ చేయించారు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..