Hyderabad Multiplexes: ఆంధ్రప్రదేశ్ లో అనావృష్టి.. తెలంగాణాలో అతివృష్టి.. అన్నచందంగా ఉంది సినిమా థియేటర్ టికెట్ ధరల విషయంలో తాజాగా పరిస్థితి. తెలంగాణాలో సినిమా టికెట్ ధరలను చూసి.. షాక్ తిన్న సినీ ప్రేమికులకు థియేటర్ యజమానులు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా తెలంగాణలోని థియేటర్లలోని సినిమా టికెట్ ధరలను తగ్గించారు. టాలీవుడ్ నిర్మాతల అభ్యర్ధన మేరకు తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ కాస్ట్ ను పెంచుకోవచ్చు అని జీవో జారీ చేసింది. అయితే సంక్రాంతి బరినుంచి ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ వంటి భారీ సినిమాలు తప్పుకున్నాయి. తమ సినిమాలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ‘
దీంతో సంక్రాంతి రేస్ లో కింగ్ నాగార్జున, నాగచైతన్యల బంగార్రాజు సినిమా సహా పలు చిన్న సినిమాలు వచ్చాయి. అయితే చిన్న సినిమాలను చూడడానికి ప్రేక్షకులు పెద్ద మొత్తం పెట్టి టికెట్ కొనరు అని అభిప్రాయపడుతున్నారు. దీంతో చిన్న సినిమాలకు థియేటర్లకు ప్రేక్షకులు రావాలంటే టికెట్ ధరలు తగ్గించడమే మార్గమని హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్ యాజమాన్యం భావించింది. దీంతో తమ టిక్కెట్ ధరలను సవరించాయి.
తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు థియేటర్లలో టికెట్ ధరలు రూ.200, రూ.175, రూ.150గా ఉంటాయి. ఈ ధరలు రేపటి నుంచి రిలీజ్ అయ్యే కొత్తగా విడుదలయ్యే సినిమాలకు వర్తిస్తాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సీజన్‌లో బంగార్రాజు, రౌడీ బాయ్స్, డీజే టిల్లు, సూపర్ మచ్చి, హీరో వంటి పలు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. మరి ఏ సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తుందో.. సంక్రాంతి విన్నర్ గా చూస్తుందో చూడాలి మరి..
Also Read: