GHMC Mayor Love Story: ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలోను ఉంటుంది.. అది అమ్మ ప్రేమ కావొచ్చు.. అమ్మాయి, అబ్బాయిల మధ్య ప్రేమ అవ్వొచ్చు.. అయితే ప్రేమికులు తమ ప్రేమ గుర్తు చేసుకోవడానికి … లేదా తమ ప్రేమను వ్యక్తపరచడానికి వ్యక్తపరచడానికి వాలెంటైన్ డే ను ఎంచుకుంటారు కొందరు. తాజాగా హైదరాబాద్ మేయర్ గా కొత్తగా పదవి చేపట్టిన విజయలక్ష్మి తన ప్రేమ కథను గుర్తు చేసుకున్నారు.
తనకు తన భర్త స్కూల్ టైం లో పరిచయం అయ్యారని.. ఆ పరిచయం కాలేజీ వరకూ కొనసాగిందని.. అప్పుడు ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడినట్లు చెప్పారు. చదివిన చదువులు వేరు.. కులాలు వేరు అయినా మామనసులు కలిశాయి.. ఇక తమ ప్రేమను గెలిపించుకుని పెళ్లి పీటలు ఎక్కడడానికి పెద్దలను ఒప్పించాలని అనుకున్నాం.. చివరికి తమ ప్రేమను గెలిపించుకున్నామని చెప్పారు.
ఇద్దరం క్రీడాకారులం.. తాను క్రికెట్ ఆడేదానిని అదే సమయంలో క్లాస్‌మేట్ ద్వారా గజ్వేల్‌కు చెందిన బాబిరెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యారు. అతను బాస్కెట్ బాల్ క్రీడాకారుడని దీంతో తరచుగా గ్రౌండ్ లో కలిసేవారని తెలిపారు. ఇక సెలవుల్లో ఇద్దరం టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్లమని ఆ పరిచయం వేరు వేరు కాలేజీలో చేరినా ఫ్రెండ్ షిప్ వీడలేదని.. శ్రీనగర్ కాలనీలో కలిసి తిరిగేవాళ్ళం..
1984 డిగ్రీ చివరి సంవత్సరంలో బాబిరెడ్డి తనకు ముందుగా ప్రేమిస్తున్నట్లు చెప్పారని .. తను రెండు రోజులు టైం తీసుకుని ఒకే చెప్పానని అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు విజయలక్ష్మి.
అయితే తమ పెళ్ళికి కులాలు.. కుటుంబాల నేపథ్యం వేరే. విజయలక్ష్మీ తండ్రిది రాజకీయ కుటుంబం. బాంబిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. అయితే ముందుగా లైఫ్ లో స్థిరపడి.. తర్వాత కుటుంబ సభ్యుల ముందు తమ ప్రేమను వ్యక్తపరచాలని నిర్ణయించుకున్నారు.
దీంతో మేయర్ విజయలక్ష్మీ లా.. జర్నలిజంలో చేరారు. బాబిరెడ్డి బ్యాచిలర్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ చేసేందుకు అమెరికా వెళ్లారు.. ఇద్దరి మధ్య దూరం ప్రేమలేఖలు తీర్చాయని .. లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇరుకుటుంబాలకు తమ ప్రేమ గురించి చెప్పమని
ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా తమ ప్రేమ పెళ్లి పట్టాలు ఎక్కిందని తెలిపారు. ముందుగా తన భర్త తల్లిందండ్రులు ఒప్పుకోగా తన తల్లిదండ్రులు కొంచెం సమయం తీసుకున్నారని చెప్పారు. పెద్దల సమక్షంలో డిసెంబర్ 24, 1988లో ఇద్దరు ఒక్కటయ్యమని.. అయితే మేము ఇప్పటికీ ఇద్దరూ స్నేహితులుగానే ఉంటామని చెబుతున్నారు విజయలక్ష్మీ. రోజూ రాత్రి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తామన్నారు. వారికి పిల్లలు పుట్టకపోయిన ఆమెనే పసిపాపలా భర్త చూసుకుంటారని చెప్పుకొచ్చారు.. ప్రేమికుల రోజున తన ప్రేమ పెళ్లి గురించి గుర్తు చేసుకున్న హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ
Also Read: