AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Car Accident:హైస్పీడ్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు

Hyderabad hit and run:హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదర్ షాకోట్ చౌరస్తా దగ్గర వేగంగా దూసుకొచ్చిన ఒక కారు బైకర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad Car Accident:హైస్పీడ్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు
Hyderabad News
Anand T
|

Updated on: Oct 25, 2025 | 11:05 AM

Share

హైదరాబాద్‌లోని హైదర్‌ షాకోట్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జనాలను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వ్యక్తి ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా కారు డ్రైవర్ తప్పించుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గురించే పనిలో పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తిని బైక్‌పై వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఒక కారు.. అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు కింద పడడంతో తీవ్రంగా గాయపడిన కృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పారిపోయిన కారును గుర్తించేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.

Follow Us