AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మహిళపై వేధింపులు.. బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు

మహిళను వేధించారనే ఆరోపణలతో బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై కేసు నమోదైంది. ఈ మేపరకు నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను వేధించడంతో పాటు ఫొటోలో మార్పింగ్ చేసి బెదిరించారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేేపడుతున్నారు.

Hyderabad: మహిళపై వేధింపులు.. బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు
Brs
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 8:13 PM

Share

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం, దాడి, బెదిరింపులు, కులం పేరుతో దూషించడం వంటి ఆరోపణలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదైంది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి జక్కుల కిరణ్‌కుమార్ తనతో సన్నిహితంగా మెలిగారని మహిళ ఫిర్యాదులో ఆరోపించారు.

వ్యాపార భాగస్వామ్యం కోసం ఆయనకు రూ.30 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం తనపై, తన 10 ఏళ్ల కుమారుడిపై దాడి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా తన కులం పేరుతో దూషించి అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి పరువు తీసేందుకు ప్రయత్నించారని, హైదరాబాద్ విడిచి వెళ్లాలని బెదిరించారని మహిళ ఆరోపించారు. చంపేస్తామని కూడా బెదిరించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ఈ ఆరోపణలపై నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్‌ఎస్‌లోని 69, 74, 79, 115(2), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీస్ నిరోధక) చట్టం-2015లోని సెక్షన్ 3(2)(v) కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..