
హైదరాబాద్‌లో రోజురోజుకూ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఇటీవలే రాయదుర్గంలో జరిగిన వేలంలో ఎకరం భూమి భారీగా ధరకు అమ్ముడుపోగా తాజగా నగర శివారులోని కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధర పలికాయి. HMDA నిర్వహించిన వేలంలో ఎకరం ధర అత్యధికంగా రూ.137.25 కోట్లు పలికింది. కోకాపేటలోని నియోపోలిస్ ప్రాంతంలోని సర్వే నంబర్ 17, 18లో ఉన్న భూములను HMDA శనివారం వేలం వేసింది. ఈ వేలంలో సర్వే నంబర్ 17లోని భూమి ఎకరం 137.25 కోట్లు పలికింది. గతంలో ఇక్కడ నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ.100 కోట్లకు అమ్ముడైంది.
సర్వే నంబర్ 17, 18లో ఉన్న భూములకు వేలం నిర్వహించిన అధికారులు అక్కడ ఎకరా కనీస ధర రూ.99 కోట్లుగా నిర్ణయించగా.. అది అత్యధికంగా రూ.137.25 కోట్లు పలికింది. ఇక్కడ ప్లాట్ నెంబర్ 17 లో లో 4.59 ఎకరాలు ఉండగా.. ప్లాట్ నెంబర్ 18 లో 5.31 ఎకరాలు ఉన్నాయి. వీటిలో MSN అర్బన్ వెంచర్స్ LLP 5.31 ఎకరాల సరస్సు ముఖంగా ఉన్న ప్లాట్ 18ను ఎకరానికి ₹137.25 కోట్లకు కొనుగోలు చేయగా, వజ్ర హౌసింగ్ ప్రాజెక్ట్స్ LLP 4.59 ఎకరాల ప్లాట్ 17ను ఎకరానికి ₹136.50 కోట్లకు కొనుగోలు చేసింది.మొత్తానికి సోమవారం జరిగిన భూమి వేలంతో 9.90 ఎకరాలకు గానీ HMDAకు రూ. 1,355.33 కోట్లు ఆదాయం వచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.