Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారిగా.. దీన్ని గురించి తెలిస్తే అవాక్కవడం పక్కా.. వీడియో వైరల్..

హైదరాబాద్ సిటీలో పార్కింగ్ కష్టాలకు ఇక కాలం చెల్లనుంది. నగరవాసులకు ప్రపంచ స్థాయి అనుభూతిని అందించేందుకు నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో దేశంలోనే తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ ముస్తాబైంది. జర్మన్ టెక్నాలజీతో రూ. 100 కోట్ల భారీ వ్యయంతో 15 అంతస్తుల్లో నిర్మించిన ఈ అద్భుత కట్టడం అతిత్వరలోనే ప్రారంభం కానుంది.

Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారిగా.. దీన్ని గురించి తెలిస్తే అవాక్కవడం పక్కా.. వీడియో వైరల్..
Hyderabad First Automated Multi Level Parking Complex

Edited By:

Updated on: Jan 26, 2026 | 6:38 PM

హైదరాబాద్ నగర వాసులను నిత్యం ఇబ్బంది పెడుతున్న పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పనులు పూర్తి అయ్యాయి. నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయినా ఎట్టకేలకు పూర్తి అయింది. ఈ జనవరి 26 కు అందుబాటులోకి రావడానికి సిద్ధం అయినప్పటికీ…కొన్ని కారణాల తో పోస్ట్ పోన్ అయింది.

పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్ సమీపంలో హెచ్ఎంఆర్‌కు చెందిన అర ఎకరం స్థలంలో 15 అంతస్తులలో ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఇందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం.. మరో ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్క్రీన్‌లతో కూడిన థియేటర్ కూడా నిర్మించారు. పబ్లిక్, ప్రైవేట్ విధానంలో దాదాపు 100కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే తొలిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో, తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు.

ఈ మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లో మొత్తం 15 అంతస్తులు ఉంటాయి. ఇందులో 3 బేస్‌మెంట్లు, 7 పైఅంతస్తులు కలిపి మొత్తం 10 అంతస్తుల్లో పార్కింగ్‌ సదుపాయం ఉంటుంది. మరో 5 అంతస్తులను కమర్షియల్ పర్పస్ కేటాయించారు. ఈ పార్కింగ్‌ కాంప్లెక్స్‌లో అన్ని రకాల సదుపాయాలు కలిగిన రెండు సినీ థియేటర్‌లను కూడా ఏర్పాటు చేశారు. 11వ అంతస్తులో నగర వీక్షణ కోసం గ్యాలరీని ఏర్పాటు చేశారు. మొత్తం 10 పార్కింగ్‌ అంతస్తుల్లో 200 పైగా కార్లు, 200 వరకు టూ వీలర్ పార్కింగ్‌ చేయవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా నగర ప్రజలకు ప్రపంచ స్థాయి పార్కింగ్‌ అనుభవం అందించనున్నామని అధికారులు అంటున్నారు.

వీడియో చూడండి..