Hyderabad Drunk and Drive: హైదరాబాద్‌లో ఒకే రోజు 3 రోడ్డు ప్రమాదాలు.. పోలీసుల రియాక్షన్ మామూలుగా లేదుగా..!

|

Dec 07, 2021 | 10:00 AM

Drunk and Drive Accidents: హైదరాబాద్ లో ఒకే రోజు 3 రోడ్డు ప్రమాదాలు జరగటం, నలుగురు ప్రాణాలు కోల్పోవడం, పలువురు క్షతగాత్రులు

Hyderabad Drunk and Drive: హైదరాబాద్‌లో ఒకే రోజు 3 రోడ్డు ప్రమాదాలు.. పోలీసుల రియాక్షన్ మామూలుగా లేదుగా..!
Drunk And Drive
Follow us on

Drunk and Drive Accidents: హైదరాబాద్ లో ఒకే రోజు 3 రోడ్డు ప్రమాదాలు జరగటం, నలుగురు ప్రాణాలు కోల్పోవడం, పలువురు క్షతగాత్రులు గా మారటంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సాధారణ రోజుల్లో 9 నుంచి 11 గంటల వరకు శని ఆదివారాల్లో 11 నుంచి 2 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ నిర్వహిస్తారు. అయితే ఆదివారం జరిగిన యాక్సిడెంట్లు సోమవారం ఎక్కువ సమయం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. మొత్తం వెస్ట్ జోన్ లో ఎనిమిది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ పరిధిలో 3, బంజారాహిల్స్ పరిధిలో 2, పంజాగుట్ట, బేగంపేట్, ఎస్సార్ నగర్ పరిధిలో ఒక్కోచోట పరీక్షలు నిర్వహించారు. ఇందుకోసం సౌత్ జోన్ నుంచి కూడా పోలీస్ లను రంగంలోకి దింపారు. దాదాపుగా 60 వరకు కేసులు చేశారని అని తెలుస్తోంది.

అయితే మందుబాబుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఏమాత్రం భయం లేకుండా తప్పతాగి డ్రైవింగ్ చేస్తున్నారు. చాలాచోట్ల 150 నుంచి రెండు వందల మిల్లీ లీటర్ల వరకు మీటర్ రీడింగ్ నమోదైంది. కొన్నిచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమేకాదు, నో హెల్మెట్, నెంబర్ ప్లేట్లు సరిగా లేకపోవడం, సరైన డాక్యుమెంట్స్ క్యారీ చేయకుండా వాహనాలు నడిపిస్తున్న సంఘటనలు కూడా వెలుగు చూశాయి. శ్రీనగర్ కాలనీ రోడ్ లోని గ్రీన్ బావర్చి వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా.. పోలీసులకు చిక్కిన ఓ వ్యక్తి నెంబర్ ప్లేట్ సరిగా లేకుండా తాను మీడియాకు చెందిన వ్యక్తిని అంటూ తనని ఎందుకు ఇబ్బంది పెడతారంటూ కాసేపు హంగామా చేశాడు. ఇక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నిర్వహించిన చెక్ పాయింట్ వద్ద కూడా మందుబాబులు గట్టిగా తాగి దొరికారు. మద్యం మత్తులో ఉన్న మందుబాబులు.. పోలీసులకు పట్టుబడగా తమలోని యాక్టింగ్ స్కిల్స్‌ని ఓ రేంజ్‌లో ప్రదర్శించారు. ఫుల్లుగా తాగిన ఓ వ్యక్తి.. వాహనం నడుపుతూ దొరికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ ఇవ్వడానికి పోలీసుల్ని తిప్పలు పెట్టాడు.

ఇక జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45.. కేబుల్ బ్రిడ్జి రోడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిత్యం జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ పన్నెండు దాటిన ఈ రోజు టెస్ట్ లు నిర్వహించారు. పోలీసులు పలు కేస్ లు బుక్ చేశారు. ఇక్కడ ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేంద్రరెడ్డి ప్రత్యక్షంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లను దగ్గరుండి పర్యవేక్షించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద కూడా రాత్రి 12 గంటల 30 నిమిషాల వరకూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. అయితే మందు బాబులు మాత్రం ఓరేంజ్ కిక్కు లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. టు వీలర్ తో దొరికిన ఒక వ్యక్తి ఏకంగా 180 పాయింట్లతో పట్టుబడ్డాడు. వెహికల్ ఇవ్వటానికి రూల్స్ ఒప్పుకోకపోవడంతో పోలీసులు బండిని స్టేషన్ కి తరలించారు. మొత్తంగా చూసుకుంటే.. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో వెహికల్ సీజ్ చెయ్యరు కదా అనే నిర్లక్ష్యం వాహనదారుల్లో కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది.

Also read:

Students Missing: సినిమాకు వెళ్లారని టీచర్ల మందలింపు.. నలుగు విద్యార్థుల అదృశ్యం.. తల్లిదండ్రుల ఆందోళన..

Vijayawada: విజయవాడపై నీలి చిత్రాల నీడలు.. వెలుగులోకి కీలక విషయాలు.. మరో ఐదుగురిపై కేసు

House on Moon: చంద్రుడిపై ఉన్న ఆ వింత ఆకారం ఏంటబ్బా.. వైరల్ అవుతున్న ఫోటోలు.. మిస్టరీని చేధించే పనిలో శాస్త్రవేత్తలు..!