Rajasingh: ఈసీకి ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు.. రాజాసింగ్‌పై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

ఎన్నికల ముంగిట గోషామహల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ ఈసీకి ఫిర్యాదు చేస్తే.. ఆయనకు కౌంటర్‌గా సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. రిగ్గింగ్ జరగకుండా చూడాలని రాజాసింగ్ కోరితే.. రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయనపై ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఎన్నికల ర్యాలీలో రాజాసింగ్ విద్వేషపూరిత ప్రసంగం చేసిన వీడియోను తీసివేయాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ X ని కోరారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు.

Rajasingh: ఈసీకి ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు.. రాజాసింగ్‌పై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
Mla Raja Singh

Edited By:

Updated on: Nov 16, 2023 | 1:29 PM

ఎన్నికల ముంగిట గోషామహల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ ఈసీకి ఫిర్యాదు చేస్తే.. ఆయనకు కౌంటర్‌గా సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. రిగ్గింగ్ జరగకుండా చూడాలని రాజాసింగ్ కోరితే.. రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయనపై ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఎన్నికల ర్యాలీలో రాజాసింగ్ విద్వేషపూరిత ప్రసంగం చేసిన వీడియోను తీసివేయాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ X ని కోరారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యంత సున్నితమైన నియోజకవర్గాల్లో గోషామహల్ ఒకటి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్రంగా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. తన నియోజకవర్గంలో రిగ్గింగ్ జరుగుతోందనీ.. దొంగ ఓట్లు ఉన్నాయని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని కొన్ని బూత్‌లలో గత ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ఈసీకి రాజాసింగ్ ఫిర్యాదు చేశారు.

ఈసారి అలా జగరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూరా CEO వికాస్‌రాజ్‌‌కి వినతి పత్రం ఇచ్చారు. అన్ని పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు.. లేడీ పోలీస్ ఆఫీసర్లను ఉండాలని కోరారు. సెంట్రల్ ఫోర్సెస్‌‌ని కూడా అదనంగా ఉండాలని కోరారు. పోలింగ్ టైంలో బూత్‌లోకి ఎవరు వచ్చినా ID కార్డ్ చూపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. అంతేకాకుండా కొంతమంది పోలీస్ అధికారులు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు రాజాసింగ్.

ఇక రాజాసింగ్‌పైనా సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎన్నికల ప్రచారంలో.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని రాజాసింగ్‌పై ఫిర్యాదు చేశారు. ముస్లిం యువతులను సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేయాలంటూ హిందువులను రాజాసింగ్ రెచ్చగొడుతున్నారంటూ ఓ వీడియోను ఆధారంగా చూపిస్తున్నారు. నవంబర్ 14న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక వర్గంపై రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదు చేశారు.

అంతేకాదు ఎన్నికల ర్యాలీలో రాజాసింగ్ విద్వేషపూరిత ప్రసంగం చేసిన వీడియోను తీసివేయాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ X ని కోరారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. X లో ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఉంచిన HindutvaWatch (@HindutvaWatchIn) సోషల్ మీడియా ఖాతాను సైతం తీసివేయాలని అభ్యర్థించారు పోలీసులు. హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుండి ఒక అభ్యర్థనను స్వీకరించినట్లు ట్విట్టర్ X పేర్కొంది. కంటెంట్ “భారత చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఉందని వెల్లడించింది. ఈ విషయానికి సంబంధించి X నుండి కరస్పాండెన్స్ యొక్క స్క్రీన్‌షాట్‌ను విడుదల చేసింది.

భారతీయ జనతా పార్టీ నుంచి గతంలో సస్పెండ్ అయ్యి.. మళ్లీ బీజేపీ టికెట్ దక్కించుకున్నారు రాజాసింగ్. ఆయనను ఓడించాలని అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. గోషామహల్‌ నుంచి ప్రస్తుత బీఆర్‌ఎస్‌ నంద కిషోర్‌ వ్యాస్‌ బిలాల్‌ను బరిలోకి దించగా, కాంగ్రెస్‌ తన అభ్యర్థిగా మొగిలి సునీతరావు ముధిరాజ్‌ను ప్రతిపాదించింది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ సమయంలో నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…