Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ విద్వేషపూరిత వ్యాఖ్యలపై తుది తీర్పు నేడే.. సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ..
Akbaruddin Hate Speech Case: పదేళ్ల కిందట మాట.. ఆ మాట రెండు మతాల మధ్య చిచ్చుపెట్టింది. రాజకీయ పార్టీల మధ్య వైరం పెంచింది.. కోర్టు దాకా వెళ్లింది. ధర్మపీఠం దద్దరిల్లింది. దశాబ్దం పాటు విచారణ కొనసాగింది. ఇప్పుడామాటపై న్యాయస్థానం అంతిమ తీర్పు ఇవ్వనుంది.
పదేళ్ల కిందట మాట.. ఆ మాట రెండు మతాల మధ్య చిచ్చుపెట్టింది. రాజకీయ పార్టీల మధ్య వైరం పెంచింది.. కోర్టు దాకా వెళ్లింది. ధర్మపీఠం దద్దరిల్లింది. దశాబ్దం పాటు విచారణ కొనసాగింది. ఇప్పుడామాటపై న్యాయస్థానం అంతిమ తీర్పు ఇవ్వనుంది. పదేళ్ల కిందట రాజకీయ పరిస్థితులు వేరు.. రాష్ట్రం ఉన్న తీరు వేరు.ప్రభుత్వాలు మారాయి.. పొలిటికల్ దోస్తీలు ఛేంజ్ అయ్యాయి. తీర్పు పతంగీ భాయ్‌కు అనుకూలంగా వస్తే ఓ టెన్షన్.. రాకుంటే మరో టెన్షన్. పైగా రంజాన్ మాసం. ఏం జరుగుద్దోనన్న ఉత్కంఠ.. మరి తీర్పులో ఏముంది.. తీర్పు తర్వాత ఏం జరగనుంది..? ఎంఐఎం నేత అక్బరుద్దీన్ విద్వేష వ్యాఖ్యలకు సంబంధించిన రెండు కేసుల్లో నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువడనుంది. ఇప్పటికే నలభై రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన అక్బరుద్దీన్.. కి ఎంత శిక్ష పడనుంది? ఈ కేసుల్లో అక్బరుద్దీన్ తప్పించుకునే మార్గమేదైనా ఉందా? లేక కోర్టు కఠినంగా వ్యవహరించనుందా?
అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు..
వేదిక- ఎంఐఎం సభ, నిర్మల్ మున్సిపల్ గ్రౌండ్స్.. అక్బరుద్దీన్ ప్రసంగం .. మీరు 100 కోట్ల మంది.. మేం కేవలం పాతిక కోట్లు మాత్రమే.. ఓ పదిహేను నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువ తక్కువో చూపిస్తాం.. అంటూ అక్బరుద్దీన్ చేసిన ఈ ప్రసంగంపై ఐపీసీ 120- బీ, 153 ఏ, 295, 298, 188 సెక్షన్ల కింద పోలీసులు సుమోటోగా కేసులు పెట్టారు. ఈ కేసులో అరెస్టయిన అక్బర్ 40 రోజుల పాటు జైల్లో శిక్ష అనుభవించారు.
ఇదే కాదు ఆదిలాబాద్ లో హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్. ఈ రెండు కేసులపై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు వెలువడనుంది. అక్బరుద్దీన్ ఆదిలాబాద్ హిందూ దేవతలపై వ్యతిరేక మాటలు . ఈ రెండు కేసుల్లో కోర్టు శిక్ష విధించిన పక్షంలో రెండేళ్ల వరకూ అక్బర్ కు జైలు శిక్ష పడే ఛాన్సుంది. అందుకే ఇక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఇవి కూడా చదవండి: Hyderabad: సమయం లేదు మిత్రమా.. బంపర్ ఆఫర్ మూడు రోజులే.. ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే..
Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..