Hyderabad: ఈ సీసీ కెమెరాలు మహా సెడ్డవప్ప.. చోరీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చెంచులక్ష్మి..

|

Dec 16, 2022 | 7:32 PM

Telangana: దేవుళ్లను నమ్మే మనుషుల్లారా.. మనుషులు చేసిన దేవుళ్లురా.. జరభద్రం బీ కేరఫుల్‌.. ఎందుకంటే.. చెంచు లక్ష్మీ రీ ఎంట్రీతో రఫ్పాడిస్తోంది మరి. ఎనీ సెంటర్‌.. ఎనీ టెంపుల్‌.. సింగిల్‌ హ్యాండెడ్‌గా ఖేల్‌ ఖతమ్‌ అనిపిస్తుంది.

Hyderabad: ఈ సీసీ కెమెరాలు మహా సెడ్డవప్ప.. చోరీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చెంచులక్ష్మి..
Chenchu Lakshmi
Follow us on

దేవుళ్లను నమ్మే మనుషుల్లారా.. మనుషులు చేసిన దేవుళ్లురా.. జరభద్రం బీ కేరఫుల్‌.. ఎందుకంటే.. చెంచు లక్ష్మీ రీ ఎంట్రీతో రఫ్పాడిస్తోంది మరి. ఎనీ సెంటర్‌.. ఎనీ టెంపుల్‌.. సింగిల్‌ హ్యాండెడ్‌గా ఖేల్‌ ఖతమ్‌ అనిపిస్తుంది. రీసెంట్‌గా ఏకంగా అంబర్‌పేట అంజన్న గుడిలోనే లూటీ చేసింది ఈ మామాలేడీ. అవును మరి.. చెంచులక్ష్మి ఒకప్పుడు పోలీస్‌ రికార్డులో మోస్ట్‌వాంటెడ్‌. అప్పట్లోనే తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా సీరియల్‌ చోరీలతో చుక్కుల చూపించింది. దొరికితే జైలు.. ఆ తరువాత బెయిల్‌. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు పోరళ్లతో విజిల్‌ పెట్రోలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.

అప్పట్లోనే దగ్గర దగ్గర హాఫ్‌ సెంచరీ కేసులు ఆమెపై ఉండేవి. ఇప్పుడు సెంచరినో.. డబుల్‌ సెంచరీనో.. లెక్కెంతో తెలీదు కానీ, రోజులు మారాయి కదా. నిఘా పెరగడంతో చెంచులక్ష్మి గ్యాంగ్‌ కనుమరుగైందనుకున్నారు. కానీ టెస్టులు.. వన్డేలు పోయి టీ 20 ఫార్మాట్‌ వచ్చినట్టుగా లేటెస్ట్‌ టెంపుల్‌ రన్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది చెంచులక్ష్మి. అదీ సింగిల్‌ హ్యాండ్‌‌గా. తాజాగా అంబర్‌పేట బుర్జుగల్లీలోని అంజన్న గుడితో పాటు పూజారి ఇంట్లో చోరీకి పాల్పడింది చెంచులక్ష్మీనేనని గుర్తించారు పోలీసులు.

ఇన్నాళ్లు చెంచులక్ష్మి సందడి లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు జైల్లోనే శిక్ష అనుభవించింది. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చింది. రావడం రావడమే అంబర్‌పేటలో పంజా విసిరింది. సింగిల్‌గా వచ్చినా సివంగిలా పంజా విసరడం చెంచులక్ష్మి స్టయిల్‌. చోరీ చేసే క్రమంలో ఎవరొడ్డిచ్చినా సరే ఢీ అంటే ఢీ అనే టైపు. ఇక చోరీ కోసం టూల్స్ అండ్‌ టెక్నాలజీ మరో లెవల్‌. అంబర్‌పేటలో రీ ఎంట్రీ ఇచ్చిన చెంచులక్ష్మీ చోరీ కథా చిత్రమ్‌ సీసీ ఫుటేజ్‌లో తళుక్కుమంది. దాంతో పక్కా ఆధారాలతో చెంచులక్ష్మిని అరెస్ట్‌ చేసి చోరి ప్రాపర్టీని రికవరీ చేసిన ఎస్‌ రాంచందర్‌రాజు, మల్లేష్‌ అండ్‌ టీమ్‌ను అభినందించారు డిటెక్టివ్‌ ఇన్‌ప్పెక్టర్‌ ప్రభాకర్‌.

ఇవి కూడా చదవండి

తాజా చోరీ కేసుతో చెంచులక్ష్మి కథ మళ్లీ కటకటాలకు చేరింది. ఇక ఇటీవలి కాలంలో ఆలయాలే టార్గెట్‌గా సీరియల్‌ చోరీలు హడలెత్తిస్తున్నాయి. హుండీలను కొల్లగొట్టడం.. భయం భక్తి లేకుండా ఆ గర్బగుడిలోకి ప్రవేశించి నగలు ఎత్తుకెళ్లడం.. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. తాజాగా యాదాద్రి జిల్లా మోత్కూరులో వేంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. రెండు కిలోల వెండి కిరీటం, శంకు చక్రాలు, వీడియో రికార్డింగ్ సామగ్రి, పలు సామగ్రి ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..