Huzurnagar Election Result 2023: హుజూర్ నగర్‌లో పాగా వేసిన ఉత్తమ్‌.. మెజారిటీ ఎంతంటే..

హుజూర్‌ నగర్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పాగా వేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై విజయం సాధించారు. ఇక సీపీఐఎం నుంచి మల్లు లక్ష్మీ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సూర్యాపేట జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ (Huzurnagar Assembly Election) ఒకటి. ఎప్పుడూ జిల్లాలో హాట్ హాట్ రాజకీయాలు నడిచే నియోజక వర్గాల్లో లిస్ట్‌లో కూడా హుజూర్ నగర్ ఉంది...

Huzurnagar Election Result 2023:  హుజూర్ నగర్‌లో పాగా వేసిన ఉత్తమ్‌.. మెజారిటీ ఎంతంటే..
Huzurnagar

Edited By:

Updated on: Dec 03, 2023 | 1:20 PM

హుజూర్‌ నగర్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పాగా వేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై విజయం సాధించారు. ఇక సీపీఐఎం నుంచి మల్లు లక్ష్మీ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సూర్యాపేట జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ (Huzurnagar Assembly Election) ఒకటి. ఎప్పుడూ జిల్లాలో హాట్ హాట్ రాజకీయాలు నడిచే నియోజక వర్గాల్లో లిస్ట్‌లో కూడా హుజూర్ నగర్ ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఈ నియోకవర్గం ఏర్పాటు అయింది. నియోజక వర్గ పరిధిలో మొత్తం ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. హుజూర్ నగర్, నేరెడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు, మఠంపల్లి, మేళ్ల చెరువు, చింతలపాలెం మండలాలు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం నియోజకవర్గంలో 2 లక్షల 30 వేల 355 ఓట్లు ఉన్నాయి. ఈ నియోజక వర్గంలో పురుషుల కంటే 4 వేల 2 వందల 43 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నాయి. నియోజక వర్గంలో ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడినా సిమెంట్‌ పరిశ్రమలు, రైసు మిల్లులు కూడా విస్తరించి ఉన్నాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

ఈ నియోజక వర్గంలో ఇప్పటి వరకు ఉప ఎన్నికతో కలిసి నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా మూడు సార్లు కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉత్తమ్.. ఇక్కడి నుంచి వరసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ 2019లో వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉత్తమ్ రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి (బీఆర్ఎస్) విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్ సతీమణి పద్మావతిపై ఆయన 43 వేల పైచీలు ఓట్లతో ఆయన విజయం సాధించారు.

తాజా ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి సైదిరెడ్డే పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ రంగంలోకి దిగారు. బీజేపీ నుంచి చల్లా శ్రీలతా రెడ్డి బరిలోకి నిలిచారు. తన మెజార్టీ 50 వేలు దాటుతుందని ఉత్తమ్ పదే, పదే చెబుతున్నారు. ఫలితం మరికొద్దిసేపట్లో రానుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్