Huzurabad By Election: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మరో షాక్.. ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు

హుజూరాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే దాకా వెళ్లింది.

Huzurabad By Election: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మరో షాక్.. ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు
Huzurabad By Poll

Updated on: Oct 13, 2021 | 8:40 PM

Huzurabad By Election: హుజూరాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే దాకా వెళ్లింది. తాజాగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు, తీవ్ర నేరారోపణతో కూడిన కేసులో ఇరిరించే ప్రయత్నం చేసిన బీజేపీ అభ్యర్థి ఈటలపైన, ఆ పార్టీపైన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అలాగే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై దుష్ప్రచారం చేస్తూ లబ్ధిపొందే ప్రయత్నిస్తున్నారంటూ ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈట‌ల రాజేంద‌ర్‌తో పాటు బీజేపీ పార్టీ నాయ‌కులు టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న అస‌త్య ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరుతూ ఆ పార్టీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు పార్టీ ప్రధాన‌కార్యద‌ర్శి సోమ భ‌ర‌త్‌కుమార్ ప‌లు కేసుల‌పై ఆధారాల‌తో పాటు క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత జగన్ పై బీజేపీ నేతల దాడి, హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ రోడ్ నిర్వహించడంపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ డబ్బులు ఇస్తుందని దుష్ప్రచారం చేయడంతో పాటు, డబ్బులు తీసుకోమని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లును తప్పుదోవ పట్టించడంపై ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. వీటన్నిపై ఆధారాలతో ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్.

అలాగే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు, తీవ్ర నేరారోపణతో కూడిన కేసులో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ , ఆ పార్టీ నాయ‌కులు ఇరికించే ప్రయత్నం చేశార‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఆయ‌న ఫిర్యాదు చేశారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసందే.

Trs Complaint

Read Also…  DL, RC Permit: డాక్యుమెంట్స్ లేకుండా డ్రైవింగ్‌ చేస్తే భారీ జరిమానా.. కేంద్రం కీలక నిర్ణయం.. ఎప్పటినుంచంటే..?