Huzurabad By Election Result: హుజురాబాద్‌లో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రజా ఏక్తా పార్టీ షాక్..

|

Nov 02, 2021 | 11:33 AM

హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. పోస్టల్‌ బ్యాలెట్లలో 344 ఓట్ల లీడ్ సాధించింది టీఆర్‌ఎస్‌.

Huzurabad By Election Result: హుజురాబాద్‌లో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రజా ఏక్తా పార్టీ షాక్..
Siliveru Srikanth
Follow us on

హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. పోస్టల్‌ బ్యాలెట్లలో 344 ఓట్ల లీడ్ సాధించింది టీఆర్‌ఎస్‌. అయితే తొలి రౌండ్‌లో మాత్రం బీజేపీ ఆధిక్యం కనబరిచింది. బీజేపీకి 4610, టీఆర్ఎస్‌కు 4444 ఓట్లు, కాంగ్రెస్ 119 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండ్‌లో 166 ఓట్ల ఆధిక్యం కనబరిచింది బీజేపీ. అయితే అధికార టీఆర్‌ఎస్‌కు ప్రజా ఏక్తా పార్టీ వల్ల మరోసారి ఇబ్బంది ఎదురైనట్లు స్పష్టమవుతోంది. కారు గుర్తును పోలిన రోటీ మేకర్‌ గుర్తుకు 122 ఓట్లు పోలయ్యాయి. ఈ గుర్తును ప్రజాఏక్తా పార్టీది. ఆ పార్టీ నుంచి సిలివేరు శ్రీకాంత్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కంటే ఈ గుర్తుకే ఎక్కువ ఓట్లు పోలవ్వడం గమనార్హం. ఫస్ట్ రౌండ్‌లోనే ఇన్ని ఓట్లు పోలయ్యాయి. అన్ని రౌండ్స్ ముగిసేసరికి ఈ గుర్తుకు పోలయిన ఓట్ల సంఖ్య ఎంత ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే కమలాన్ని పోలి ఉన్న వజ్రం గుర్తుకు కూడా ఓట్లు భారీగా పడుతున్నట్లు తెలుస్తోంది.

ఫస్ట్ రౌండ్‌లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయో దిగువ పట్టికలో చూడండి…

రెండో రౌండ్…

రెండో రౌండ్‌లో 193 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ లీడ్‌ ఉంది. రెండు రౌండ్లు కలిపి బీజేపీ 359 ఓట్లు ఆధిక్యం వచ్చింది. రెండో రౌండ్‌లో బీజేపీ 4659, టీఆర్ఎస్ 4851, కాంగ్రెస్ 220 ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. హుజురాబాద్ టౌన్‌లోని సగం ఓట్లు రెండో రౌండ్‌లో లెక్కించారు. సిర్సపల్లి, సింగాపూర్, తమ్మనపల్లి, మందపల్లి, బోయినపల్లిలోని ఓట్లను లెక్కించారు. మూడో రౌండ్‌లో హుజురాబాద్‌ మిగిలిన భాగం లెక్కిస్తారు. కాగా రెండోొ రౌండ్‌లో కూడా టీఆర్‌ఎస్‌ గుర్తును పోలి ఉన్న రోటీ మేకర్‌కు 158 ఓట్లు పడ్డాయి. మొత్తంగా రెండు రౌండ్లు ముగిసేసరికి ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌కు 280 ఓట్లు పోలయ్యాయి.

 

 

 

Also Read: Gutta Suman: గుత్తా సుమన్ నేర చరిత్ర.. బెజవాడ మామిడి తోటల నుంచి కొలంబో కాసినోల దాకా