Huzurabad Bypoll: పెనుగులాట జరుగుతుంది… ఏం చేసినా జనం నా వెంటే.. ఎన్నికల్లో గెలిచి తీరుతాంః ఈటల

Huzurabad By Election:హుజురాబాద్‌లో మాటల యుద్ధం పీక్స్‌కు చేరుతోంది. అధికార, విపక్ష నేతలు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్బీ-జేపీ నేతల మధ్య తూటాలు పేలకుండానే యుద్ధ వాతావరణం నెలకొంది.

Huzurabad Bypoll: పెనుగులాట జరుగుతుంది... ఏం చేసినా జనం నా వెంటే.. ఎన్నికల్లో గెలిచి తీరుతాంః ఈటల
Etela Rajendar

Updated on: Oct 06, 2021 | 6:37 PM

Etala Rajender Election Campaign: హుజురాబాద్‌లో మాటల యుద్ధం పీక్స్‌కు చేరుతోంది. అధికార, విపక్ష నేతలు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య తూటాలు పేలకుండానే యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పుడు తెలంగాణలో ఎటుచూసిన ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నిక హాట్ టాపిక్. ఎట్టిపరిస్థితుల్లో ఈ ఎన్నికలో గెలిచి తీరాలని అధికార పార్టీ టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తనకు అవమానించిన పార్టీని ఓడించి కాషాయ జెండా ఎగరేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసాయి.

ఈ నేపథ్యంలో బుధవారం తన సొంత మండలమైన కమలాపూర్ లోని గుండేడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈటల రాజేందర్. ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఈటల వారితో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా ఈటల గ్రామ మహిళలను కోరారు. ఇందుకు మహిళలందరూ ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఏదేమైనా మూకుమ్మడిగా ఈటల రాజేందర్‌ను మరోసారి గెలిపించుకుంటామని ఆయన సమక్షంలోనే తీర్మానం చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని, ఇవన్నింటికి చెక్ పెట్టాలంటే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈటల రాజేందర్ కోరారు. ప్రజా సమస్య పరిష్కారానికి ఎప్పుడు వెన్నంటే ఉంటానని హామీ ఇచ్చారు. ‘పెనుగులాట జరుగుతుంది… ఏం చేసినా నా వెంట ఉంట అని ప్రజలు వస్తున్నారు. అధికార పార్టీ ఫీజు పీకే రోజు 30వ తేదీయే. గుర్తుంచుకొండి” అంటూ ఈటల రాజేందర్ మహిళలకు సూచించారు.

Read Also…   Bathukamma Celebrations live video: ఘనంగా బతుకమ్మ వేడుకలు… వరంగల్ వేయిస్తంభాల గుడి సమీపంలో.. (లైవ్ వీడియో)