Huzurabad By Election: హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి.. ఆమె పేరు ఖరారయ్యే అవకాశం..!

|

Aug 21, 2021 | 10:55 AM

Huzurabad By Election: తెలంగాణలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు తమతమ గెలుపులపై అంచనా వేసుకుంటున్నాయి. భారీ మెజార్టీతో..

Huzurabad By Election: హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై  కసరత్తు పూర్తి.. ఆమె పేరు ఖరారయ్యే అవకాశం..!
Follow us on

Huzurabad By Election: తెలంగాణలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు తమతమ గెలుపులపై అంచనా వేసుకుంటున్నాయి. భారీ మెజార్టీతో గెలుపొందేందుకు వివిధ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తయింది. టీపీసీసీకి ముగ్గురి పేర్లతో ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ నివేదిక అందజేశారు. నివేదికలో ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో కొండా సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. నివేదికతో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మానిక్కం ఠాగూర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియాగాంధీ ఆమోదంతో ఒకటి, రెండు రోజుల్లో కొండా సురేఖ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నిక షెడ్యూల్‌ ఆలస్యం కానుందా..?

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు తమతమ గెలుపులపై అంచనా వేసుకుంటున్నాయి. భారీ మెజార్టీతో గెలుపొందేందుకు వివిధ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. కాగా, ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్ట్‌లో షెడ్యూల్ వస్తుందని భావించినప్పటికీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వాహణపై తమ అభిప్రాయం ఈనెల 30లోపు తెలియజేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ దేశంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో ఈనెల 30వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. దాదాపు సెప్టెంబర్ 15లోపు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉండే అవకాశం లేదని తేలిపోయింది. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో హుజూరాబాద్‌కు ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎన్నికల అధికారులు.

ఇవీ కూడా చదవండి:

Mamata Banerjee: బీజేపీని ఎదుర్కోవాలంటే కోర్ గ్రూప్ ని ఏర్పాటు చేయాల్సిందే.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

Huzurabad By Election: హుజూరాబాద్‌‌ గెలుపే లక్ష్యంగా పని చేయండి.. నియోజకవర్గ సమీక్షలో సీఎం కేసీఆర్