Telangana: భార్య మృతదేహాన్ని ఇంటికి తరలిస్తుండగా.. భర్తకు ఆక్సిడెంట్ చివరికి..

|

Jul 16, 2023 | 1:52 PM

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొరిగింటి వాళ్లతో గొడవ పడిన ఓ మహిళ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతదేహాన్ని తరలిస్తుండగా.. భర్త లారీ కింద పడి మృతి చెందడం కలకలం రేపింది.

Telangana: భార్య మృతదేహాన్ని ఇంటికి తరలిస్తుండగా.. భర్తకు ఆక్సిడెంట్ చివరికి..
Road Accident
Follow us on

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొరిగింటి వాళ్లతో గొడవ పడిన ఓ మహిళ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతదేహాన్ని తరలిస్తుండగా.. భర్త లారీ కింద పడి మృతి చెందడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే లక్సెటిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన మల్లికార్జున్‌ రావు (31), శరణ్య (29) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల పక్కింటివారితో శరణ్య గొడవపడి మనస్తాపం చెందింది. దీంతో ఈనెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు కరీనంగర్ ‌కు తరలించారు.

శరణ్య చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ స్వగ్రామానికి తరలించారు. ఇలా తరలిస్తున్న క్రమంలోనే లక్సేటిపేటలోని చౌరస్తా వద్ద మల్లిఖార్జున్ వస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మల్లిఖార్జున్ అక్కడిక్కడే మృతి చెందారు. భార్యభర్తల మృతితో వారి పిల్లలు అనాథలుగా మారారని బంధు మిత్రులు రోదిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం