
Huge Theft: హైదరాబాద్ నగర శివారుల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. తాజాగా దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేటలోని సాయి ప్రణీత గృహ సముదాయంలో సినీ ఫక్కీలో దొంగతనం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. సాయి ప్రణీత వెంచర్‌లో నూతన గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. వెంచర్‌కు కాపాలాగు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. అయితే దుండగులు.. చాలా పక్కాగా ప్లాన్ వేసుకుని అర్థరాత్రి వేళ తమ పథకాన్ని అమలు చేశారు. ముగ్గురు కాపాలాదారులను తాళ్లతో కట్టేశారు.
ఆపై గృహ సముదాయంలో ఉన్న రూ. 5 లక్షల విలువ గల విద్యుత్ సామాగ్రిని ఎత్తుకెళ్లారు. దాంతో ఈ దోపిడీపై వెంచర్ నిర్వాహకులు దుండిగల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. విషయాన్ని గుట్టుగా ఉంచారు. బాలానగర్ జోన్ డీసీసీ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు వివరణ కోరాగా నిరాకరించారు. ఈ దోపిడీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Also read:
Bus Collided :విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సు బీభత్సం.. ప్రమాద తీవ్రతకు ఉలిక్కిపడిన స్థానికులు..
కొంపముంచిన కామక్రీడ.. శృంగారంలో పీక్స్ చేరాలని ప్రియుడిని నైలాన్ తాడుతో కట్టింది.. తీరా చూస్తే.!