CM Relief Fund: పక్కాగా.. పారదర్శకంగా!.. ఇక నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌..!

| Edited By: Balaraju Goud

Jul 02, 2024 | 8:39 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) దరఖాస్తులను ఇక నుంచి ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

CM Relief Fund: పక్కాగా.. పారదర్శకంగా!.. ఇక నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌..!
Cm Revanth Reddy On Cmrf
Follow us on

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) దరఖాస్తులను ఇక నుంచి ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో వెబ్ సైట్ ను రూపొందించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వెబ్ సైట్ ను మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు.

గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పెట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇక ముందు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఈ వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధింత దరఖాస్తు దారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ను  సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ ఎఫ్ అప్లికేషన్ ను ఆమోదించి చెక్ ను సిద్ధం చేస్తారు. చెక్ పైన తప్పని సరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ ను ముద్రిస్తారు. దీని వల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్ లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https//cmrf.telangana.gov.in\ సైట్ లో దరఖాస్తు అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

అర్హత ప్రమాణాలు:

  • ఆరోగ్య సమస్యలతో బాధపడే పేద ప్రజలు దీనికి అర్హులు.
  • ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాలు కూడా వర్తింపు.
  • బాధితులు తప్పనిసరిగా తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి.

అవసరమైన పత్రాలు:

  • ఆధార్ కార్డు
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో
  • వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • రేషన్ కార్డు
  • వైద్య బిల్లులు
  • బ్యాంకు అకౌంట్​ తప్పనిసరి
  • ఫోన్ నంబరు
  • ఈ-మెయిల్ ఐడీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..