Telangana: అంత్యక్రియలు చేస్తుండగా తేనెటీగల దాడి.. ఓ వ్యక్తి మృతి.. 12 మందికి తీవ్ర గాయాలు..

|

Oct 23, 2022 | 10:45 PM

విధి మనషుల జీవితాలతో ఆడుకుంటుందని తెలుసు కానీ.. మరీ ఇంతలా అని తెలీదు. ఓ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా..

Telangana: అంత్యక్రియలు చేస్తుండగా తేనెటీగల దాడి.. ఓ వ్యక్తి మృతి.. 12 మందికి తీవ్ర గాయాలు..
Honey Bee
Follow us on

విధి మనషుల జీవితాలతో ఆడుకుంటుందని తెలుసు కానీ.. మరీ ఇంతలా అని తెలీదు. ఓ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. తేనెటీగలు దాడి చేయడంతో మరొకరి ప్రాణాలు పోయాయి. మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుందీ ఘటన. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మంచిర్యాల జిల్లాలోని బబ్బెరచెలుక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మృతదేహానికి అంతిమసంస్కారాలు నిర్వహించేందుకు వెళ్తున్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కోటపల్లి మండలంలోని బబ్బెరచెలుక గ్రామానికి చెందిన కొండపర్తి చంద్రకాంత అనే 70 అనే మహిళ మృతి చెందింది. ఆమెకు దహన సంస్కారాలు చేయడానికి గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు.

మృతదేహాన్ని తీసుకుని స్మశానం దగ్గరకు వెళ్లగానే తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేయడంతో.. అంత్యక్రియలు పూర్తి చేయకుండానే బంధువులు పరుగులు తీశారు. అయినప్పటికీ వెంటపడి మరీ దాడి చేశాయి. ఈ ఘటనలో పాత దేవులవాడ గ్రామానికి చెందిన బొల్లంపల్లి బాపు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చెన్నూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ 12 మందిలోనూ మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..