AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3డీ డిజిటల్ ట్విన్ సిటీగా హైదరాబాద్.. రియల్ టైమ్‌లో నగరమంతా కళ్లముందుకు..!

హైదరాబాద్ మహానగరాన్ని అత్యాధునిక సాంకేతికతతో డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడానికి హెచ్ఎండీఏ కసరత్తు ప్రారంభించింది. భాగ్యనగరాన్ని పూర్తిస్థాయి 3డీ ‘డిజిటల్ ట్విన్ సిటీ’గా మార్చే ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలిచి ప్రత్యేక ఏజెన్సీని ఎంపిక చేయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలోని భవనాలు, రహదారులు, పార్కులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, ప్రజా స్థలాలు వంటి భౌతిక నిర్మాణాలన్నింటినీ త్రీడీ రూపంలో రియల్ టైమ్‌లో వీక్షించే అవకాశం ఉంటుంది.

3డీ డిజిటల్ ట్విన్ సిటీగా హైదరాబాద్.. రియల్ టైమ్‌లో నగరమంతా కళ్లముందుకు..!
Hyderabad 3d Digital Twin City ,Image Credit source: AI Image
Prabhakar M
| Edited By: |

Updated on: Jul 03, 2026 | 10:20 AM

Share

హైదరాబాద్ మహానగరాన్ని అత్యాధునిక సాంకేతికతతో డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడానికి హెచ్ఎండీఏ కసరత్తు ప్రారంభించింది. భాగ్యనగరాన్ని పూర్తిస్థాయి 3డీ ‘డిజిటల్ ట్విన్ సిటీ’గా మార్చే ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలిచి ప్రత్యేక ఏజెన్సీని ఎంపిక చేయనుంది.

ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలోని భవనాలు, రహదారులు, పార్కులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, ప్రజా స్థలాలు వంటి భౌతిక నిర్మాణాలన్నింటినీ త్రీడీ రూపంలో రియల్ టైమ్‌లో వీక్షించే అవకాశం ఉంటుంది. సాధారణ మ్యాప్‌లతో పోలిస్తే మరింత స్పష్టమైన దృశ్య సమాచారాన్ని ఇది అందిస్తుంది. హెచ్ఎండీఏ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్‌తో పాటు పెరి అర్బన్ రీజియన్‌ను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ మోడల్‌గా రూపొందించనున్నారు. మొత్తం మహానగరాన్ని ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

హైదరాబాద్ మహానగరాన్ని డిజిటల్ ట్విన్‌గా మార్చేందుకు డ్రోన్లు, 3డీ స్కానర్లు, హెలికాప్టర్లు, హై-రిజల్యూషన్ కెమెరాల సహాయంతో ప్రతి ప్రాంతాన్ని సవివరంగా మ్యాపింగ్ చేయనున్నారు. అనంతరం ఆ సమాచారాన్ని డిజిటల్ మోడల్‌లో సమీకరిస్తారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో రహదారులు, తాగునీటి పైపులైన్లు, మురుగునీటి వ్యవస్థ, వర్షపు నీటి కాల్వలు, విద్యుత్ నెట్‌వర్క్‌లు, భవిష్యత్తులో ఏర్పడే అండర్‌గ్రౌండ్ కేబుళ్ల వివరాలు కూడా పొందుపరచాలని ప్రణాళిక ఉంది. దీంతో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మరింత సులభమవుతుంది.

కొత్త రహదారి నిర్మాణం, పైపులైన్ మార్పులు లేదా ఇతర మౌలిక వసతుల పనులు ప్రారంభించే ముందు వాటిని డిజిటల్ ట్విన్‌లో పరిశీలించే అవకాశం ఉంటుంది. ఒక శాఖ చేపట్టే పనులపై మరో శాఖకు ముందుగానే సమాచారం అందేలా వ్యవస్థ పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితులు, అగ్నిప్రమాదాలు, వరదలు లేదా ట్రాఫిక్ జామ్‌ల సమయంలో ఈ సాంకేతికత కీలకంగా ఉపయోగపడనుంది. పరిస్థితిని రియల్ టైమ్‌లో అంచనా వేసి, ఏ శాఖ ఎలా స్పందించాలనే అంశంపై వేగంగా నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది.

అక్రమ నిర్మాణాలు, ఫుట్‌పాత్ ఆక్రమణలు, ట్రాఫిక్ సమస్యలు వంటి అంశాలను కూడా అధికారులు కార్యాలయం నుంచే డిజిటల్ మోడల్‌లో పరిశీలించగలుగుతారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు, అత్యవసర స్పందన ప్రణాళికలను కూడా వెంటనే రూపొందించవచ్చు. ప్రపంచంలోని పలు ఆధునిక నగరాల్లో ఇప్పటికే డిజిటల్ ట్విన్ సాంకేతికత అమల్లో ఉంది. అదే తరహాలో హైదరాబాద్‌ను కూడా స్మార్ట్, డేటా ఆధారిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. ప్రాజెక్టు అమలుకు ఎంపికయ్యే ఏజెన్సీ దాదాపు రెండేళ్లలో డిజిటల్ ట్విన్ వ్యవస్థను రూపొందించనుంది. అనంతరం కొంతకాలం నిర్వహణ బాధ్యతలు కూడా అదే సంస్థ చేపట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
స్క్రీన్‌పై భాగ్యనగరం.. 3డీ అవతారంలో హైదరాబాద్!
స్క్రీన్‌పై భాగ్యనగరం.. 3డీ అవతారంలో హైదరాబాద్!
కింగ్ ఈజ్ బ్యాక్.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌తో మైదానంలోకి కోహ్లీ
కింగ్ ఈజ్ బ్యాక్.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌తో మైదానంలోకి కోహ్లీ
ఆ ఇద్దరితో జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేను.. వేణు మాధవ్
ఆ ఇద్దరితో జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేను.. వేణు మాధవ్
కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్
కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్
మరణాన్ని ముద్దాడే మగ తేనెటీగ.. ఈ ప్రకృతి కథ తెలిస్తే అవాక్కే..
మరణాన్ని ముద్దాడే మగ తేనెటీగ.. ఈ ప్రకృతి కథ తెలిస్తే అవాక్కే..
మృత్యువుతో 7 రోజుల పోరాటం.. శిథిలాల నుంచి సజీవంగా..!
మృత్యువుతో 7 రోజుల పోరాటం.. శిథిలాల నుంచి సజీవంగా..!
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి