High Temperature In Telangana: తెలంగాణలో భానుడి భగభగలు.. ఏకంగా 43 డిగ్రీలకు.. మార్చిలోనే ఇలా ఉంటే మే నాటికి..

|

Mar 30, 2021 | 3:59 PM

High Temperature In Telangana: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో బయటకి రావాలంటే భయాపడాల్సిన పరిస్థిలు తలెత్తున్నాయి. మార్చిలోనే రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది...

High Temperature In Telangana: తెలంగాణలో భానుడి భగభగలు.. ఏకంగా 43 డిగ్రీలకు.. మార్చిలోనే ఇలా ఉంటే మే నాటికి..
High Temperature In Telanga
Follow us on

High Temperature In Telangana: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో బయటకి రావాలంటే భయపడాల్సిన పరిస్థిలు తలెత్తున్నాయి. మార్చిలోనే రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతోన్న ఉష్ణోగ్రతలు భయాన్ని కలిగిస్తున్నాయి.
రాష్ట్రంలో సోమవారం అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెనలో ఏకంగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సగటు గరిష్ట ఉష్ణోగ్రత 38.8 నుంచి 42.7 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తాజాగా ఖైరతాబాద్‌ పరిధిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చిలోనే ఎండలు ఈ రేంజ్‌లో ఉంటే.. మే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎండలు మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఎండలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇక ఎండా కాలంలో డీహైడ్రేషన్‌ సమస్య పొంచి ఉండే ప్రమాదం ఉన్న కారణంగా నీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సలహాలిస్తున్నారు.

Also Read: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం.. ఫేక్ ముఠా అరెస్ట్..

Suicide: హైదరాబాద్‌లో దారుణం.. నమ్మించి వంచించాడు.. చివరికి అవమానించి గెంటివేయడంతో..

రంగారెడ్డి జిల్లాలో విషాదం.. పెళ్లైన నాలుగు నెలలకే కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. కారణం అదేనా..!