ఎండలు బాబోయ్.. ఎండలు..

భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు.. వడగాడ్పులకు విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణాలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. పగటి వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆదివారం వడగాడ్పులకు అయిదుగురు మృతి చెందినట్టు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ముందు, ముందు రోజుల్లో కూడా ఎండలు ఇలాగే ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రావద్దని చెప్తున్నారు. ముఖ్యంగా.. వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు […]

ఎండలు బాబోయ్.. ఎండలు..

Edited By:

Updated on: Apr 30, 2019 | 12:08 PM

భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు.. వడగాడ్పులకు విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణాలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. పగటి వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆదివారం వడగాడ్పులకు అయిదుగురు మృతి చెందినట్టు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ముందు, ముందు రోజుల్లో కూడా ఎండలు ఇలాగే ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రావద్దని చెప్తున్నారు. ముఖ్యంగా.. వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు పాటించాలని.. అలాగే.. వాటర్ ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.