బీసీ రిజర్వేషన్ బిల్లుపై మరికొన్ని వాదనలు వినిపిస్తామని ఏజీ.. విచారణ రేపటికి వాయిదా!

బీసీ రిజర్వేషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపు అంటే గురువారం (అక్టోబర్ 9) మధ్యాహ్నం 2:15గంటలకు వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున మరికొన్ని వాదనలు వినిపిస్తామని అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తులను కోరారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తరపున అడ్వకేట్లు బలమైన వాదనలు వినిపించారు.

బీసీ రిజర్వేషన్ బిల్లుపై మరికొన్ని వాదనలు వినిపిస్తామని ఏజీ.. విచారణ రేపటికి వాయిదా!
High Court Adjourns Hearing Of Bc Reservation Bill

Updated on: Oct 08, 2025 | 5:09 PM

బీసీ రిజర్వేషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపు అంటే గురువారం (అక్టోబర్ 9) మధ్యాహ్నం 2:15గంటలకు వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున మరికొన్ని వాదనలు వినిపిస్తామని అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తులను కోరారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తరపున అడ్వకేట్లు బలమైన వాదనలు వినిపించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లను సమర్థించాయని, బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదని, చట్టం ద్వారా జారీ చేసిన GOలను ఛాలెంజ్ చేశారని అన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులకు కారణమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను ఛాలెంజ్ చేయడం కుదరదని ప్రభుత్వ తరుఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి వాదించారు. రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50% దాటకూడదని రాజ్యాంగంలో లేదని, సుప్రీంకోర్టు ఆదేశం మాత్రమే ఉందన్నారు. ఎంపిరికల్ డేటా ఉంటే 50% క్యాప్ పెంచవచ్చని తీర్పులున్నాయని, డేటా ఆధారంగా ప్రభుత్వానికి, శాసన వ్యవస్థకు నిర్ణయాధికారం ఉంటుందన్నారు అభిషేక్‌ సింఘ్వి. కానీ 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పాసైన సమయంలో ఈ కసరత్తు జరగలేదన్నారు. 2019లో EWS 10% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని దీంతో రిజర్వేషన్లు 60శాతం దాటాయన్నారు.

కులగణన సర్వే డేటాను అభిషేక్ సింఘ్వీ కోర్టు ముందు ఉంచారు. ఈ డేటా ఫోర్జరీ అని పిటిషనర్లు అనుకుంటున్నారోమోనని, కులగణన ముమ్మాటికీ ఎంపిరికల్ డేటానే అని సింఘ్వీ అన్నారు. డోర్ టు డోర్ సమగ్ర సర్వే తర్వాతే బీసీలకు 42% రిజర్వేషన్‌ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు సింఘ్వీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..