Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ నంబర్లు..

| Edited By: Subhash Goud

Feb 25, 2022 | 6:23 AM

ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న తెలుగువారిని రక్షించేందుకు రెండు రాష్ట్రాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ నంబర్లు..
Ukraine Russia War
Follow us on

ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న తెలుగువారిని రక్షించేందుకు రెండు రాష్ట్రాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈక్రమంలో వారి కోసం రెండు తెలుగు రాష్ట్రాలు వేరువేరుగా హెల్ప్ లైన్ నెంబర్లను (Helpline Numbers) ఏర్పాటు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం (TS Government) ఢిల్లీలోని తెలంగాణ భవన్, రాష్ట్ర సెక్రటేరియట్‌ కార్యాలయంలో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐపీఎస్ అధికారి విక్రమ్ సింగ్ మాన్ ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. కాగా తెలంగాణ వారి కోసం +91 7042566955, +91 9949351270, +91 9654663661 హెల్ప్ లైన్ నంబర్లతో పాటు rctelangana@gmail.com. ఇ-మెయిల్ ఐడీని ఏర్పాటు చేశారు. సీనియర్ అధికారి E.చిట్టిబాబు తాత్కాలిక సచివాలయం, BRKR భవన్ లో వీటిని కో-ఆర్డినెట్ చేయనున్నారు. వీటితో పాటు 040-23220603, +91 9440854433 హెల్ప్ లైన్ నంబర్లుతో పాటు e-mail nri@telengana.gov.in లను సంప్రదించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సూచించారు.

హైదరాబాద్‌ చేరుకున్న 32 మంది విద్యార్థులు..

ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారికోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. 9871999055 నెంబర్ ద్వారా నోడల్ అధికారి రవి శంకర్, 7531904820 ద్వారా అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారి, రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్‌ గీతేష్ శర్మను సంప్రదించాలని కోరింది. అదేవిధంగా 9848460046 నంబర్‌ కు కాల్‌ చేసి ఏపీ ఎన్ఆర్‌టీ సీఈఓ దినేష్ కుమార్‌ ను సంప్రదించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. కాగా ఉక్రెయిన్ నుంచి తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 32 మంది విద్యార్థులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులను చూసిన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Also Read:Russia Ukraine Crisis: రష్యా దాడులపై అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ..

Jharkhand: నదిలో పడవ బోల్తా.. 14 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..

Viral Video: అమ్మో పాము.. గుడ్లన్నీ గుటుక్కున మింగేసింది.. ఆ తరువాత ట్విస్ట్ చూస్తే షాక్..