Telangana Weather: రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..

Telangana weather: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరించింది. అంతేకాదు రెడ్ అలర్ట్,

Telangana Weather: రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..
Rain

Updated on: Sep 26, 2021 | 4:48 PM

Telangana weather: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరించింది. అంతేకాదు రెడ్ అలర్ట్, ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. నిన్న ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారింది. ఈ తుఫాను ఉత్తర ఆంధ్రా- దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతాల్లో విశాఖపట్నం, గోపాల్ పూర్, కళింగ పట్నం దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తుఫాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. మత్స్యకారులు ఈ రెండు రోజులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని అధికారులు సూచిస్తున్నారు.

CAIRN DISPUTE: న్యూయార్క్ కోర్టులో భారత్‎కు ఊరట.. కెయిర్న్​ ప్రయత్నాలకు అడ్డుకట్ట

Amit Shah Lunch Meet: తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సహా నలుగురు ముఖ్యమంత్రులతో అమిత్ షా ప్రత్యేక లంచ్ మీటింగ్!

Perni Nani: ఏపీలోనే నిర్మాతలకు ఎక్కువ షేర్‌.. జనసేన అధినేత పవన్‌కు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్..

ఎల్‌ఐసీ నుంచి ప్రీమియం చెల్లించకుండా 75 వేల ప్రయోజనం..! పిల్లలకు స్కాలర్‌షిప్ అవకాశం..?