Hyderabad Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్‌.. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా.

Hyderabad Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్‌.. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ
Hyderabad Rain

Updated on: Jul 04, 2022 | 4:14 PM

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యాయి. భారీ వర్షం కురియడంతో జీహెచ్‌ఎంసీ (GHMC) సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి వాతావరణం చల్లగానే ఉంది. ఉదయం లేదా రాత్రి పూట జోరుగా వర్షం కురుస్తోంది. ఇందుకు తోడు రానున్న 24 గంటల్లో జార్ఖండ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్‌ పరిసర ప్రాంతాల్ఓల ఉన్న ఉపరితల ఆవర్తనం జార్ఖండ్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అలాగే ఏపీలోనూ రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో ప్రలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.

ఇవి కూడా చదవండి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి