Telangana: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు, గాలివానలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం వర్షాల తీవ్రత మరింతగా పెరగనుంది. తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీరు నిలిచిపోవచ్చని, వాగులు, చెరువులు పొంగిపొర్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

Telangana: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
Telangana Weather Report

Updated on: Sep 07, 2025 | 6:19 PM

తెలంగాణ లేటెస్ట్ వెదర్ అప్ డేట్ వచ్చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావం క్రమంగా పెరుగుతుండడంతో.. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుఫాన్‌ బలహీనంగా ఉన్నప్పటికీ.. సోమవారం నుంచి దాని ప్రభావం పెరుగుతుందని.. మంగళ, బుధ వారాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, బలమైన గాలులు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.

హైదరాబాద్‌తో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో గాలివానలు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాత్రివేళ బయటకు వెళ్లే వారు, రైతులు, వ్యవసాయ కార్మికులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సెప్టెంబర్ 8, 9 తేదీలలో వర్షాల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీరు నిలిచిపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, చెరువులు పొంగిపొర్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అవసరమైన వైద్య సహాయం, రక్షణ చర్యలు తక్షణం అందేలా రెస్క్యూ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ ముందస్తు చర్యలు చేపడుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి.