Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Rain Alert: దక్షిణ ఉత్తరప్రదేశ్ నుండి మధ్యప్రదేశ్, విదర్భల మీదుగా దక్షిణ మరత్వాడ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతోంది. ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం, రాయలసీమ..

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Updated on: Sep 20, 2025 | 7:51 AM

Rain Alert: ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఈనెల 27 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ ఏపీలో పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది IMD.కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.

ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?

శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో..

అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత రెండు, మూడు రోజుల నుంచి సాయంత్రం కాగానే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఈ రోజు, రేపు తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

దక్షిణ ఉత్తరప్రదేశ్ నుండి మధ్యప్రదేశ్, విదర్భల మీదుగా దక్షిణ మరత్వాడ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతోంది. ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటకల మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి. మీ ఎత్తులో ఈ ద్రోణి ఏర్పడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి