Telangana: రహదారిని కమ్మేసిన దట్టమైన పొగ.. ప్రయాణంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దట్టమైన పొగమంచు చుట్టూ కమ్మేస్తే ఎలా ఉంటుంది.. ఏదో తెలియని ఆనందం ఉప్పొంగి పోయేలా చేస్తుంది.. కానీ మంచు చూసి మురిసేలోపు మృతువు తలుపు తడుతుంది.. రహదారుల పై రక్తం కల్లాపు చల్లుతుంది.. మంచు కురిసే వేళలో ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలుసా..? రహదారులను కమ్మేస్తున్న ఆ పొగ మంచే ఆయువు మింగేస్తుంది.. బాటసారులను బలి కోరుతుంది.. సూర్యుడు ఉదయించక ముందే కొన్ని జీవితాల్లో పొగమంచు కారుచీకట్లు కమ్ముకునేలా చేస్తుంది

Telangana: రహదారిని కమ్మేసిన దట్టమైన పొగ.. ప్రయాణంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Cold Wave

Edited By:

Updated on: Jan 17, 2025 | 1:55 PM

నిత్యం ఎన్నో ప్రమాదాలు చూస్తుంటాం… ఘోర రోడ్డు ప్రమాదాల గురించి వింటుంటాం.. కానీ చలి కాలంలో తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య కలవర పెడుతోంది.. అర్థరాత్రి నుండి ఉదయం 8 లోపు జరిగే ప్రమాదాల సంఖ్య ఎక్కువని రవాణాశాఖ, పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి.. కారణం ఏంటో తెలుసా..?పొగ మంచే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం.

దట్టమైన పొగ మంచు రహదారిని కమ్మేసి చిమ్మ చీకట్లు అలముకున్నా కొందరు ప్రయాణం మాత్రం ఆపరు… దట్టమైన పొగమంచులో ప్రయాణం ప్రమాదకరమని తెలుసు..? కానీ గమ్య స్థానానికి చేరడం కోసం స్పీడ్ లిమిట్ లేకుండా పరుగులు పెట్టే వాహనదారులు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. పొగ మంచు ప్రభావంతో ముందున్న వాహనాలను గుర్తించలేక కొందరు.. రహదారుల పై గుంతలను గమనించలేక జరుగుతున్న మరికొన్ని ప్రమాదాలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.. సూర్యుడు ఉదయించక ముందే వాళ్ల ప్రాణాలు ఆ పొగ మంచులో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారులపైనే అత్యధికంగా పొగ మంచు వల్ల ప్రమాదాల సంభవిస్తున్నాయి.. కొన్ని డెంజర్ స్పాట్స్ గుర్తించి అక్కడ ప్రమాద సూచికలు పెట్టినా వాహనదారుల్లో మాత్రం నిర్లక్షం వీడడం లేదు.. రహదారులను కామ్మేసిన పొగ మంచు వాహనదారుల ప్రాణాలు మింగేస్తుంది.. అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది..ఈ పొగ మంచు ప్రమాదాల వల్ల ఎంతోమంది విగత జీవులుగా మారుతున్నారు.

హైదరాబాద్ నుండి మహారాష్ట్ర, చెత్తిస్ గడ్, అటు ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళే మూడు జాతీయ రహదారులు వరంగల్ ఉమ్మడి జిల్లా మీదుగానే వెళ్తుంటాయి.. పొగ మంచు ప్రభావంతో కేవలం ఒక వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే గత ఏడాది పొగమంచు వల్ల జరిగిన ప్రమాదాలలో 171 మంది చనిపోయారు.. కొత్త సంవత్సరం లో ఇప్పటికే ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. హెడ్ లైట్స్ వేసుకొని వాహనాలు నడుపుతున్నా దట్టమైన పొగమంచు అలముకోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి.. ముఖ్యంగా లారీలు, ఇతర వాహనాలు రహదారుల పక్కనే నిర్లక్ష్యంగా పార్కింగ్ చేయడం వల్ల వెనుకనుండి డీ కొని ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.. రెండు రోజుల క్రితం దేవరుప్పుల వద్ద జరిగిన అలాంటి ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.. ఏడుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు.. గురువారం ఉదయం వరంగల్ – హైదారాబాద్ మద్య జాతీయ రహదారిపై రాయగిరి వద్ద కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది.. లారీని వెనుకనుండి కారు డీ కొట్టిన ఘటనలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన తల్లి బిడ్డలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

జాతీయ రహదారులపై వాహనాల పార్కింగ్ వల్ల పొంచి ఉన్న పొగ మంచు ప్రమాదాల పై మరిన్ని వివరాల మా స్పెషల్ కరస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. మంచు కురిసే వేళలో ప్రమాదాలపై రవాణాశాఖ అధికారులు, పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా వాహనదారులలో మాత్రం అదే నిర్లక్ష్యం.. అతివేగం.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి