Rains in Warangal: అన్నదాతలపై కన్నెర్ర చేసిన ప్రకృతి.. పిడుగుపడి దుక్కిటెద్దులు మృతి.. నీట మునిగిన పంటలు

|

Mar 19, 2023 | 9:17 AM

తనకు వ్యవసాయంలో సాయం చేస్తూ అన్నింటా చేదోడువాదోడుగా ఉన్న రెండు ఎద్దులు మరణించడంతో యజమానురాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చూపరుల కంట తడి పెడుతున్నారు

Rains in Warangal: అన్నదాతలపై కన్నెర్ర చేసిన ప్రకృతి.. పిడుగుపడి దుక్కిటెద్దులు మృతి.. నీట మునిగిన పంటలు
Rains In Warangal
Follow us on

అన్నదాతలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రాల్లో అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కుండపోతగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఈదురుగాలులతో ఉరుములు.. మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. ‌మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది.

వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో పిడుగుపడి రెండు దుక్కిటెద్దులు మృతి చెందాయి. తనకు వ్యవసాయంలో సాయం చేస్తూ అన్నింటా చేదోడువాదోడుగా ఉన్న రెండు ఎద్దులు మరణించడంతో యజమానురాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చూపరుల కంట తడి పెడుతున్నారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లపై విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మొండ్రైయి గ్రామ సమీపంలో రోడ్లపై విరిగి పడిన చెట్లను  అధికారులు తొలగించారు. అకాల వర్షానికి పంటలు తుడిచి పెట్టుకుని పోయాయి. చేతికి వచ్చిన పంట అకాల వర్షంతో  కాపాడలేకపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి