Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు. అయితే ప్రస్తుతం మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. పగటిపుట ఉష్ణోగ్రతలు ఏకంగా ఐదు డిగ్రీలు తగ్గాయి. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకే అత్యధిక ఉష్ణోగ్రతలు పరిమితమైనాయి. మరో రెండు మూడు రోజులపాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే
Telangana Weahter Updates

Updated on: May 07, 2026 | 7:22 PM

హైదరాబాద్‌, మే 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు. అయితే ప్రస్తుతం మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. పగటిపుట ఉష్ణోగ్రతలు ఏకంగా ఐదు డిగ్రీలు తగ్గాయి. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకే అత్యధిక ఉష్ణోగ్రతలు పరిమితమైనాయి. మరో రెండు మూడు రోజులపాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం భద్రాచలం మినహా మిగతా జిల్లాలన్నీ 40 లోపే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. భద్రాచలంలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాదులో స్వల్పంగా 36. 8 డిగ్రీలకే పగటిపూట ఉష్ణోగ్రతలు పరిమితమైనాయి.

మరోపక్క నిన్న ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాతావరణ మార్పులవల్ల గత కొన్ని రోజులుగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

నేటి పగలు ఉష్ణోగ్రతలు ఇలా..

  • అదిలాబాద్ 39.8 డిగ్రీలు
  • భద్రాచలం 40.2 డిగ్రీలు
  • హనుమకొండ 38.5 డిగ్రీలు
  • హైదరాబాద్ 36.8 డిగ్రీలు
  • ఖమ్మం 40 డిగ్రీలు
  • మహబూబ్ నగర్ 38.9 డిగ్రీలు
  • మెదక్ 39.2 డిగ్రీలు
  • నల్గొండ 39.5 డిగ్రీలు
  • నిజాంబాద్ 39.4 డిగ్రీలు
  • రామగుండం 38.2 డిగ్రీలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us